Mohammed Shami: బుమ్రాకు ఒక న్యాయం, షమీకి మరో న్యాయమా?.. బీసీసీఐని నిలదీసిన కైఫ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి భారత జట్టులో వరుసగా చోటు దక్కకపోవడంపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. దేశవాళీ క్రికెట్లో రాణిస్తూ వికెట్లు తీస్తున్న షమీని జాతీయ జట్టుకు ఎందుకు ఎంపిక చేయడం లేదో సెలెక్టర్లు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 2023 వన్డే ప్రపంచ కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించిన షమీ సేవలను ఎలా విస్మరిస్తారని ప్రశ్నించాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా విషయంలో పనిభార నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నప్పుడు.. షమీ విషయంలోనూ అలాంటి విధానాన్ని పరిశీలించవచ్చని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
భారత జట్టు ఇటీవల న్యూజిలాండ్ పర్యటన కోసం జట్లను ప్రకటించింది. ఈ పర్యటనలో రెండు టెస్టులు, ఐదు వన్డేలు, ఐదు టీ20లు జరగనున్నాయి. అయితే ఈ జట్లలో మహ్మద్ షమీకి చోటు దక్కకపోవడం చర్చకు దారితీసింది. దేశవాళీ మ్యాచ్‌ల్లో అతడు చూపిస్తున్న ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోవాలని మహ్మద్ కైఫ్ సూచించాడు. 2023 వన్డే ప్రపంచ కప్‌లో షమీ అద్భుతమైన బౌలింగ్‌తో భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కేవలం ఏడు మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా గాయంతో జట్టుకు దూరమైన తర్వాత భారత బౌలింగ్ విభాగంలో లోటు కనిపించకుండా షమీ కీలకంగా వ్యవహరించాడని కైఫ్ గుర్తుచేశాడు.
Also Read
- Parthiv Patel-BCCI: ఏడాదికి రూ.3 కోట్లు.. అయినా చీఫ్ సెలెక్టర్ పదవికి నో చెప్పిన పార్థివ్ పటేల్.. అసలు కారణం ఇదేనా?
- Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
- Chris Gayle Catch: 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. గాల్లోకి ఎగిరి స్టన్నింగ్ క్యాచ్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే!
- Surya Kumar Yadav: టీమిండియా నుంచి డ్రాప్.. ఆ టోర్నీలో సూర్యకుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్..
‘ప్రపంచ కప్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐదుగురు ప్రధాన బౌలర్లతోనే బౌలింగ్ విభాగాన్ని సమర్థంగా నడిపించగలిగాడు. అందులో షమీ పాత్ర ఎంతో కీలకం. షమీ లేకపోతే ఆరో బౌలింగ్ ఆప్షన్ కోసం భారత్ ఇబ్బంది పడాల్సి వచ్చేది. అలాంటి బౌలర్‌ను వరుసగా జట్టుకు దూరంగా ఉంచుతున్నప్పుడు అందుకు గల కారణాలను వెల్లడించాల్సిన బాధ్యత సెలెక్టర్లపై ఉంది. క్రికెట్ ఎంపికల విషయంలో పారదర్శకత అవసరం. ఎవరూ ప్రశ్నలు అడగడం లేదు. బీసీసీఐ సెలెక్టర్లు కూడా తమ నిర్ణయాలపై వివరణ ఇవ్వడం లేదు. జవాబుదారీతనం ఉండాలి. ఇది 2023 ప్రపంచ కప్‌లో అద్భుతంగా ఆడిన షమీకి సంబంధించిన విషయం. అతడు లేకపోతే భారత్ ఫైనల్‌కు చేరేది కాదు. హార్దిక్ పాండ్యా గాయపడిన తర్వాత షమీ జట్టులోకి వచ్చి ఆరో బౌలర్ అవసరాన్ని మర్చిపోయేలా చేశాడు. షమీ లేకపోతే భారత్ ఆరో బౌలింగ్ ఆప్షన్ కోసం వెతకాల్సి వచ్చేది’ అని కైఫ్ చెప్పుకొచ్చాడు.
షమీ దేశవాళీ క్రికెట్లోనూ మంచి ప్రదర్శనలు చేస్తున్నాడని కైఫ్ గుర్తుచేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌తో పాటు రంజీ ట్రోఫీలో ఆడుతూ వికెట్లు తీస్తున్నప్పుడు అతడి ప్రదర్శనను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోవాలని సూచించాడు. అయితే షమీ మ్యాచ్ ఫిట్నెస్, టెస్టు క్రికెట్లో ఎక్కువసేపు బౌలింగ్ చేయగల సామర్థ్యంపై కొన్ని సందేహాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశవాళీ మ్యాచ్‌ల్లో అతడు తక్కువ వ్యవధి స్పెల్స్ వేస్తుండటం కూడా అతడి సన్నద్ధతపై చర్చకు కారణమైనట్లు సమాచారం. ఈ అంశాలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. బుమ్రా విషయంలోనూ టెస్టు క్రికెట్లో పనిభార నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నారని కైఫ్ గుర్తుచేశాడు. ఇంగ్లాండ్ పర్యటనలో బుమ్రా బౌలింగ్ భారాన్ని జట్టు జాగ్రత్తగా నిర్వహించిందని, గిల్ నాయకత్వంలోని భారత జట్టు అతడి స్పెల్స్‌ను ప్రణాళికాబద్ధంగా ఉపయోగించుకుందని పేర్కొన్నాడు. ఒక బౌలర్ విషయంలో అలా వ్యవహరిస్తున్నప్పుడు, మరొకరికి కూడా అలాంటి విధానాన్ని అనుసరించవచ్చు అని.. తక్కువ స్పెల్స్ వేసినా ఫలితం సాధించగలిగితే అందులో తప్పేమీ లేదని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
తాజావార్తలు
-
Mohammed Shami: బుమ్రాకు ఒక న్యాయం, షమీకి మరో న్యాయమా?.. బీసీసీఐని నిలదీసిన కైఫ్!
-
CM Chandrababu: ఓటు ఒక ఆయుధం.. ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు కీలకం
-
IPCC: 1000మంది సైంటిస్టులు..100 గంటలు.. ఒక్కటే తీర్పు.. ముందుంది ముసళ్ల పండగ!
-
Annamalai: తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ.. అన్నామలై కీలక ప్రకటన..
-
Hair Oiling Tips: తలస్నానం చేయడానికి ముందు నూనె రాయాలా? లేక తర్వాత రాయాలా? డౌట్ క్లియర్ చేసుకోండి..
ట్రెండింగ్
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!