Shubman Gill: “మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు”.. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill: ఐపీఎల్ 2026 సీజన్లో శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) 29 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమిపై గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్ర అసంతృప్తి, నిరాశ వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఫీల్డర్లు ఏకంగా నాలుగు క్యాచ్‌లు చేజార్చడం ఆ జట్టు కొంపముంచింది. ముఖ్యంగా కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను వదిలేయడంతో.. అతడు రెచ్చిపోయి కేవలం 35 బంతుల్లోనే 93 పరుగులు రాణించాడు. అలాగే అంగ్క్రిష్ రఘువంశీ ఇచ్చిన క్యాచ్‌ను సైతం చేజార్చడంతో అతను 44 బంతుల్లో 82 పరుగులతో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇంతటి పేలవమైన ఫీల్డింగ్ ప్రదర్శన తర్వాత అసలు తాము “గెలవడానికి ఏమాత్రం అర్హులం కాదు” అని గిల్ కుండబద్దలు కొట్టాడు.
మ్యాచ్ ముగిసిన అనంతరం గిల్ మాట్లాడుతూ.. “మా బౌలింగ్ గురించి పెద్దగా ఆందోళన లేదు కానీ, మా ఫీల్డింగ్ చాలా మెరుగ్గా ఉండాల్సింది. మేం ఫీల్డింగ్‌లో ఒక నిర్దిష్టమైన ప్రమాణాన్ని సెట్ చేసుకున్నాం. అలాంటిది ఈ మ్యాచ్‌లో మూడు అత్యంత సులువైన క్యాచ్‌లను వదిలేశాం. నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడానికి మేం ఏమాత్రం అర్హులం కాదు” అని ఆవేదన వ్యక్తం చేశాడు. వికెట్ కండిషన్‌ను బట్టి చూస్తే ఇక్కడ 200 నుంచి 210 పరుగులు అనేది సాధారణ స్కోరు మాత్రమేనని, కానీ తాము మరీ ఎక్కువ క్యాచ్‌లు డ్రాప్ చేశామని గిల్ అన్నాడు. పిచ్ బాగుందని, అక్కడక్కడా బంతి కొంచెం ఆగుతూ వచ్చినప్పటికీ.. తాము చేసిన స్కోరుకు తమ బ్యాటింగే కారణమని, బ్యాటర్లు బాగానే ఆడారని గిల్ జోడించాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
మరోవైపు, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 247/2 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక తమ బ్యాటర్ల అటాకింగ్ మైండ్‌సెట్‌ను కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే ఎంతగానో అభినందించాడు. “ఇది చాలా మంచి మ్యాచ్. రెండు పాయింట్లు సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఫిన్ అలెన్, అంగ్క్రిష్, కామెరాన్ గ్రీన్ల బ్యాటింగ్ విన్యాసాలు చూడ ముచ్చటగా ఉన్నాయి. క్రెడిట్ అంతా మా బ్యాటర్లకే దక్కుతుంది. మా ప్రిపరేషన్ ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. ఒకేసారి కాకుండా మ్యాచ్ బై మ్యాచ్ వెళ్లడమే మా ప్లాన్. బ్యాటర్ల ఇంటెంట్ (ఆటతీరు) అద్భుతం. గుజరాత్‌ది చాలా క్వాలిటీ బౌలింగ్ అటాక్ అనే విషయం మర్చిపోవద్దు, అలాంటి బౌలింగ్‌ను మా బ్యాటర్లు ఎదుర్కొని డామినేట్ చేయడం చూస్తుంటే ముచ్చటేస్తోంది” అని రహానే అన్నాడు.
బ్యాటర్లతో పాటు బౌలర్లు సౌరభ్ దూబే, సునీల్ నరైన్‌లను సైతం రహానే ప్రత్యేకంగా అభినందించాడు. “ఆటగాళ్లు తమ సామర్థ్యాన్ని నమ్మడమే ఇక్కడ ముఖ్యం. వీరంతా డొమెస్టిక్ సీజన్లో చాలా బాగా రాణించారు. సౌరభ్ దూబే విదర్భ లీగ్‌లో అద్భుతంగా ఆడాడు. అతను ఇక్కడికి వచ్చినప్పుడు మా కోచ్‌లందరూ అతనిలో మంచి టాలెంట్ ఉందని గుర్తించారు. కష్టపడుతూ మంచి ప్రదర్శన ఇస్తున్న ఈ కుర్రాళ్లను అభినందించాల్సిందే. అంతా నమ్మకం, ఆత్మవిశ్వాసంపైనే ఆధారపడి ఉంటుంది. పైగా జట్టులో సునీల్ నరైన్ లాంటి ఆటగాడు ఉన్నప్పుడు కెప్టెన్‌గా నా పని చాలా సులువవుతుంది. వరుణ్ చక్రవర్తి కొంచెం ఇబ్బంది పడినప్పటికీ, కాలి నొప్పితోనే ఆడేందుకు అతను చూపించిన ధైర్యాన్ని మెచ్చుకోవాలి” అని రహానే కొనియాడాడు. ఇక, ఈ గెలుపుతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకోగా, పంజాబ్ కింగ్స్ నాల్గో స్థానంలో కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Supreme Court: ‘సర్’లో పేరు లేకపోతే పౌరసత్వం లేనట్టేనా.. సంక్షేమ పథకాలు నిలిపేస్తారా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
US-Iran War: తగ్గేది లేదంటున్న ఇరాన్.. మధ్యవర్తులు ఖతార్, పాక్‌లను వదలడం లేదు..
-
ICC: ఐసీసీ సంచలన నిర్ణయం.. ఆ పాకిస్థాన్ స్టార్‌పై నిషేధం.. ఎందుకంటే..?
-
US-IRAN War: అమెరికా యుద్ధ విమానాలను ధ్వంసం చేశాం.. ఇరాన్ సంచలన ప్రకటన.
-
Pakistan: సింధు జలాలపై పాక్‌కు ఝలక్.. భారత్ దెబ్బకు విలవిల
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?