Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Sanju Samson Century Csk Thrash Mi By 103 Runs Wankhede Ipl 2026

Sanju Samson: “నా విజయ రహస్యం ఇదే”.. సెంచరీ వీరుడు సంజూ శామ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Date :April 24, 2026 , 10:48 am
By RAMAKRISHNA KENCHE
Sanju Samson: “నా విజయ రహస్యం ఇదే”.. సెంచరీ వీరుడు సంజూ శామ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sanju Samson: నిన్న (గురువారం) వాంఖడే స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్(CSK), ముంబై ఇండియన్స్‌(MI)ను 103 పరుగుల తేడాతో ఓడించింది. ఇక చెన్నై తరఫున సంజు శామ్సన్ దుమ్మురేపేశాడు. సంజూ (54 బంతుల్లో 101 నాటౌట్) సెంచరీ సాధించగా సీఎస్‌కే 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముంబై ఇంత చిత్తుగా ఓటమిపాలవ్వడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన సంజూ మాట్లాడాడు.

తన జీవితంలో వాంఖడేలో ఇంత పెద్ద మొత్తంలో సీఎస్‌కే ఫ్యాన్స్‌ను ఎప్పుడూ చూడలేదన్నాడు. ఈ ఫ్రాంచైజీకి ఆడటం గర్వంగా ఉందని చెప్పాడు. ఇక తన బ్యాటింగ్ గురించి వివరిస్తూ.. ప్రస్తుతం తాను ఆటను చాలా సింపుల్‌గా చూస్తున్నానని, పిచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడటమే తన విజయరహస్యమని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో వికెట్ సాధారణ వాంఖడే పిచ్ లాగా లేదని, బంతి స్వింగ్ అవ్వడమే కాకుండా కాస్త ఆగుతూ వస్తోందని గ్రహించినట్లు పేర్కొన్నాడు. పవర్‌ప్లే ముగిసిన వెంటనే పిచ్ స్వభావాన్ని అంచనా వేసిన సంజూ, వికెట్లు పడుతున్న సమయంలో బాధ్యతాయుతంగా ఆడాలని నిర్ణయించుకున్నాడు. “ముందే ఒక మైండ్‌సెట్‌తో రాకుండా, క్రీజులోకి వెళ్ళాక పరిస్థితులను బట్టి ఆడటం ముఖ్యం. జట్టులో సీనియర్‌గా, కెప్టెన్‌గా నా బాధ్యతను గుర్తించాను. ఒకవేళ వికెట్లు పడకుండా ఉండి ఉంటే ఇంకాస్త ముందుగానే దూకుడుగా ఆడేవాడిని. కానీ వికెట్లు పడుతున్న తరుణంలో ఒక సెటిల్డ్ బ్యాటర్ చివరి వరకు ఉండటం అవసరం, అదే నేను చేశాను” అని వివరించాడు. టోర్నీలో వరుసగా మూడు ఓటముల తర్వాత కూడా జట్టులోని యువ ఆటగాళ్లు చూపిన తెగువను సంజూ ప్రశంసించాడు. యువకులతో కూడిన ఈ జట్టులో ఆత్మవిశ్వాసం మెండుగా ఉందని, ఇదే జోరును మున్ముందు సైతం కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ప్రతి మ్యాచ్ కీలకమని, ప్రత్యర్థులు సవాల్ విసిరినప్పుడు దానికి తగ్గట్టుగా సిద్ధంగా ఉంటూ ఆటను ఆస్వాదించడమే తమ తదుపరి లక్ష్యమని సంజూ స్పష్టం చేశాడు.

Also Read

  • Sanju Samson Century: ఇది కదా కావాల్సింది.. సంజూను అభినందించిన హార్దిక్ పాండ్యా, బుమ్రా, స్కై.. వీడియో వైరల్
  • Sanju Samson Record: టీ20ల్లో చరిత్ర సృష్టించిన సంజు శాంసన్.. నంబర్ వన్‌గా 'కేరళ' కింగ్!
  • Hardik Pandya: "మా పతనానికి కారణం ఇదే".. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎమోషనల్
  • Ruturaj Gaikwad: కన్నీరు దిగమింగుతూ జట్టు కోసం ఆడాడు.. ఈ విజయం అతడికే అంకితం!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chennai super kings
  • cricket news
  • CSK vs MI
  • IPL 2026
  • ipl news

తాజావార్తలు

  • Sanju Samson: “నా విజయ రహస్యం ఇదే”.. సెంచరీ వీరుడు సంజూ శామ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • MLC Ananthababu: నేడు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్సీ అనంతబాబు!

  • PM Modi: హుగ్లీ నదిలో విహరించిన మోడీ.. దృశ్యాలు కెమెరాలో బంధించిన ప్రధాని

  • UP: నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం

  • Stock Market: మార్కెట్‌లో కొనసాగుతోన్న నష్టాల పరంపర.. కారణమిదే!

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions