Sanju Samson: ‘చెట్టా’ కాదు.. ‘సంజూ’ అని పిలవండి! ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వేళ శామ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson: నిన్న జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్(DC), చెన్నై సూపర్ కింగ్స్(CSK) మ్యాచ్‌లో సీఎస్కే అదరగొట్టింది. సంజు శామ్సన్ మరోసారి రెచ్చిపోయాడు. దీంతో చెన్నై 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 52 బంతుల్లో 7 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక సంజు శామ్సన్ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్ విన్నర్‌గా నిలవడమే కాకుండా, తన హుందాతనంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిమానులు తనను ‘చెట్టా’ (అన్నయ్య) అని పిలవడంపై స్పందిస్తూ, తనకు ఆ పిలుపు ఇష్టమేనని కానీ ‘సంజూ’ అని పిలిపించుకోవడమే మరింత ఇష్టమని నవ్వుతూ చెప్పాడు. ఇక తన బ్యాటింగ్‌లో కనిపిస్తున్న ఆ అద్భుతమైన టైమింగ్ గురించి వివరిస్తూ.. గత రెండు మూడు నెలలుగా తన ‘ఇనిషియల్ మూవ్‌మెంట్స్’పై ప్రత్యేకంగా దృష్టి పెట్టానని, ప్రాథమికాంశాలకు కట్టుబడి చేతులపై నమ్మకం ఉంచి ఆడటం వల్లే షాట్లు అంత బాగా వస్తున్నాయని తెలిపాడు. నిజానికి ఈ ట్రిగ్గర్ మూవ్‌మెంట్స్ అనేవి గత మూడు ఐదేళ్లుగా చేస్తున్నవేనని, కంఫర్ట్ జోన్‌లో ఉంటేనే ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయగలమని, బౌలర్లను బట్టి అప్పుడప్పుడు క్రీజులో కదలికలు మార్చుకోవడం తన ట్యాక్టికల్ ప్లాన్ అని వివరించాడు.
చాలామంది తనను గ్రౌండ్‌లో చాలా ప్రశాంతంగా ఉంటున్నావని అంటున్నారని, నిజానికి తాను ఎప్పుడూ ఇలాగే ఉంటానని సంజూ చెప్పుకొచ్చాడు. “నేను బయట కూర్చున్నప్పుడు కూడా చాలా ప్రశాంతంగానే ఉంటాను, కానీ ఇప్పుడు క్రీజులో ఎక్కువ సమయం కనిపిస్తున్నాను కాబట్టి అందరికీ అలా అనిపిస్తోంది. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కొన్ని విన్యాసాలు జరుగుతుంటాయి కాబట్టి, చూసే వారికి నేను మరీ ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించవచ్చు” అని చమత్కరించాడు. తన ఇన్నింగ్స్ ప్రణాళిక గురించి చెబుతూ.. లక్ష్యం, వికెట్ తీరును బట్టి పవర్‌ప్లేలో వికెట్ పడకుండా 30-35 పరుగులు చేసినా చాలని భావించానన్నాడు. స్పిన్నర్లపై తనకున్న పట్టుతో మిడిల్ ఓవర్లలో ఆ స్కోరును కవర్ చేయగలననే నమ్మకం తనకు ఉందని, అందుకే ఆరంభంలో కాస్త సమయం తీసుకున్నానని, అనుకున్నట్లే ప్లాన్ వర్కవుట్ అయిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఇక సెంచరీ మిస్ అవ్వడంపై సంజూ చాలా పరిణతితో సమాధానమిచ్చాడు. “సెంచరీలు ఎప్పుడూ స్పెషలే, కానీ ఈరోజు సెంచరీ కోసం ప్రయత్నిస్తే అది స్వార్థం అవుతుందనిపించింది. మరో ఎండ్‌లో నా పార్టనర్ చాలా బాగా ఆడుతున్నాడు, అలాంటి సమయంలో ‘నా సెంచరీ కోసం ఒక సింగిల్ ఇవ్వు’ అని అతనికి చెప్పడం నాకు ఇష్టం లేదు. అందుకే జట్టును గెలిపించి నాటౌట్‌గా వెనక్కి రావడమే నాకు ఎక్కువ సంతృప్తినిచ్చింది. ఇంకా కొన్ని మ్యాచ్‌లు ఉన్నాయి కదా, చూద్దాం మున్ముందు ఆ మూడు అంకెలు (సెంచరీ) మళ్ళీ సాధిస్తానేమో” అని సంజూ శామ్సన్ తన క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
-
Jio Prime Membership: గుడ్‌న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
One Ticket: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన TGSRTC.. ఒక్క టికెట్‌పైనే ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్‌లల్లో ప్రయాణం..
-
Allu Arjun: కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరైన అల్లు అర్జున్!
-
Bandi Sanjay: బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదు..!
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!