Preity Zinta: ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు ముంబై ఇండియన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంతో.. 11 ఏళ్ల తర్వాత మొదటిసారి పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచింది. ఈ విజయంతో జట్టు క్వాలిఫయర్ 1లో పోటీకి సిద్ధమైంది. మరోవైపు ముంబై ఓటమితో ఎలిమినేటర్ 1లో తలపడాల్సి ఉంటుంది. ఇక విజయంతో పంజాబ్ కింగ్స్ సహ యజమానిగా ఉన్న బాలీవుడ్ నటి ప్రీతి జింటా సెలబ్రేషన్స్ వీడియో, ఫోటోలు…
IPL 2025: లక్నోపై సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించడంతో ప్లేఆప్స్ నుంచి లక్నో వైదొలిగింది. ఇప్పటికే హైదరాబాద్ జట్టు ప్లేఆప్స్ నుంచి నిష్క్రమించగా, ఈ జాబితాలో చెన్నై, రాజస్థాన్, కేకేఆర్, ఇప్పడు లక్నో వచ్చి చేరింది. అటు గుజరాత్,ఆర్సీబీ, పంజాబ్ ప్లేఆప్స్ స్థానాన్ని ఖాయం చేసుకున్నాయి. నాలుగో స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడుతున్నాయి. రేపు ఇరు జట్లు పోటీ పడుతుండటంతో గెలిచిన జట్టు దర్జాగా ప్లేఆప్స్ కు చేరుతుంది. ఇదిలా…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025)లో ఈరోజు ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెన్నైని ముందుగా బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. బరిలోకి దిగిన ధోనీ నాయకత్వంలోని సీఎస్‌కే 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 డబుల్ హెడర్ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. టాస్ గెలిచిన ఆర్సీబీ మొదట బౌలింగ్ వేసింది. బరిలోకి దిగిన పంజాబ్ జట్టును 6 వికెట్లకు 157 పరుగుల స్కోరు చేసింది. ఆర్సీబీ7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. పడిక్కల్(61) దించికొట్టాడు. కింగ్ కోహ్లీ(71) వీర బాదుడు బాదాడు. వీరిద్దరూ మంచి భాగస్వామ్యం అందించారు. 43 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-37లో భాగంగా పంజాబ్ కింగ్స్ (PBKS) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ముల్లన్‌పూర్ (న్యూ చండీగఢ్)లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-35లో గుజరాత్ టైటాన్స్ (GT) ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ కోల్పోయి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఆరు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌ను కైవసం చేసుకోవాలంటే గుజరాత్ 204 పరుగులు సాధించాల్సి ఉంటుంది. కాగా.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ అక్షర్ పటేల్(39) రాణించాడు.…
ఐపీఎల్‌లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో కొనసాగనుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షం కారణంగా పూర్తి ఆట సాధ్యం కాదు. కాబట్టి 14 ఓవర్ల చొప్పున ఇరు జట్లు పోటీ పడనున్నాయి.
CSK vs KKR : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గురువారం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఘన విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు బ్యాటింగ్ విఫలమవడంతో, కోల్‌కతాకు తక్కువ స్కోరు చేధించడంలో ఎలాంటి కష్టాలూ ఎదురుకాలేదు. మ్యాచ్ ప్రారంభంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి…