Rishabh Pant’s LSG Captaincy: రూ.27 కోట్లు పెట్టి కొంటే.. అట్టర్ ఫ్లాప్ ప్రదర్శన.. పంత్ కెప్టెన్సీకి ముప్పు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant’s LSG Captaincy: ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు వరుసగా మరో సీజన్లోనూ ఘోర వైఫల్యాన్ని చవిచూడటంతో ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ నాయకత్వానికి ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తమ చివరి మ్యాచ్‌లోనూ ఓడిపోయిన లక్నో జట్టు, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచే ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో లక్నో ఫ్రాంచైజీ గ్లోబల్ క్రికెట్ డైరెక్టర్ టామ్ మూడీ స్పందిస్తూ.. జట్టు నాయకత్వంపై తాము ఒక ‘రీసెట్’ (మార్పు) గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ సీజన్లో లక్నో జట్టు ఆడిన మ్యాచుల్లో కేవలం నాలుగింటిలో మాత్రమే విజయం సాధించగా, చివరి నాలుగు మ్యాచుల్లో మూడింటిని చేజార్చుకుంది. గత సీజన్లోనూ ఈ జట్టు 10 జట్లలో 7వ స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రూ. 27 కోట్లకు లక్నో జట్టు దక్కించుకున్న రిషభ్ పంత్ ప్రదర్శన ఈ సీజన్లో ఏమాత్రం ఆకట్టుకోలేదు. అతను 13 ఇన్నింగ్స్‌లలో 28.36 సగటు, 138.05 స్ట్రైక్ రేట్‌తో, కేవలం ఒకే ఒక్క అర్ధసెంచరీ సహాయంతో కేవలం 312 పరుగులు మాత్రమే చేశాడు. ఈ గణాంకాలు అతని కెరీర్ రికార్డుల కంటే చాలా తక్కువగా ఉండటంతో, అతను తన భారీ ధరను నిరూపించుకోలేకపోయాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పంజాబ్ కింగ్స్ చేతిలో ఈ సీజన్లో 10వ ఓటమిని చవిచూసిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టామ్ మూడీ లక్నో జట్టు నాయకత్వంపై మాట్లాడారు. “కెప్టెన్సీ పరంగా పంత్ ఈ సీజన్లో చాలా సవాళ్లను ఎదుర్కొన్నాడు, ఆ ప్రభావం జట్టు ఫలితాలపై స్పష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్సీ ఒత్తిడి కారణంగానే అతని బ్యాటింగ్ ప్రదర్శన దెబ్బతిన్నదా అనే సందేహం సైతం కలుగుతోంది. ఈ సీజన్ మాకు చాలా కష్టతరంగా సాగింది, అయితే మేము దీనిపై సమయం తీసుకుని ఆలోచిస్తాం. ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ ఆశించిన ప్రమాణాలకు అనుగుణంగా మేము రాణించలేకపోయాం, కాబట్టి భవిష్యత్తులో లీడర్షిప్ ఎలా ఉండాలనే దానిపై చాలా తీవ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ప్రతి విభాగంలోనూ మార్పులు చేర్పులు అవసరమని భావిస్తున్నాం, అందువల్ల ఒక రీసెట్ గురించి ఆలోచించక తప్పదు” అని మూడీ స్పష్టం చేశారు. కేవలం మూడీ మాత్రమే కాదు, అంతకుముందు లక్నో హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ సైతం పంత్ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పంత్ కేవలం 18 ఏళ్ల వయసు నుంచే భారత జట్టుకు ఆడుతున్నాడని, కానీ గత రెండు సీజన్లుగా బ్యాటర్‌గా అతని ప్రదర్శన చాలా నిరాశాజనకంగా సాగిందనే విషయాన్ని స్వయంగా అతనే అంగీకరిస్తాడని లాంగర్ పేర్కొన్నారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
AP MPTC ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌పై డీజీపీ కీలక ప్రకటన.. ఉపేక్షించేది లేదని వార్నింగ్..
-
Jon Ossoff: 2028 యూఎస్ ప్రెసిడెంట్ రేసులో 39 ఏళ్ల కుర్రాడు? ఎవరీ జాన్ ఒసాఫ్!
-
Egg Mayonnaise Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం
-
Teacher Dies During Election Duty: ఎన్నికల విధుల్లో ప్రాణాలు కోల్పోయిన టీచర్.. చంద్రబాబు, పవన్, లోకేష్ సంతాపం
-
Cristiano Ronaldo Retirement: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రొనాల్డో గుడ్‌బై..! ఎమోషనల్ వీడియో విడుదల..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!