Bhogi: 800 మంది జూనియర్ ఆర్టిస్టులు, 22 రోజుల భీభత్సం.. శర్వానంద్ ‘భోగి’ క్లైమాక్స్ పూర్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో సరికొత్త సంచలనాలకు తెరలేపుతున్న భారీ పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’. టాలెంటెడ్ హీరో శర్వానంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో వస్తోన్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మి రాధామోహన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే, సినిమాకు అత్యంత కీలకమైన మరియు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారీ క్లైమాక్స్ షెడ్యూల్‌ను మేకర్స్ విజయవంతంగా పూర్తి చేశారు. దాదాపు 22 రోజుల పాటు నిరవధికంగా సాగిన ఈ భారీ యాక్షన్ ఘట్టం సినిమాకే హైలైట్ నిలవనుందని తెలుస్తోంది. ప్రొడక్షన్ డిజైనర్ కిరణ్ కుమార్ మన్నె ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక గైగోంటిక్ సెట్లో ఈ క్లైమాక్స్ కోసం సుమారు మూడు నెలల పాటు అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.
ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో ఏకంగా 800 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనడం విశేషం. సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ ఈ షెడ్యూల్‌ను హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించారు. ప్రఖ్యాత స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ అడ్రినలిన్-పంపింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించడం ఖాయం. ఈ చిత్రంలో ‘గంగా’ అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తున్న శర్వానంద్ తన కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. ఈ పాత్ర కోసం ఆయన పడ్డ కష్టం అంతాఇంతా కాదు. ప్రతిరోజూ దాదాపు రెండున్నర గంటల పాటు క్లిష్టమైన మేకప్ వేయించుకుని, షూటింగ్ అయ్యాక మరో గంటపాటు దానిని తొలగించడానికి శ్రమించారట. ఆయన శారీరక శ్రమ, అంకితభావం సినిమాను వేరే లెవెల్‌కు తీసుకువెళ్తాయని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Also Read
- Mamitha Baiju: నేను హీరోయిన్.. ఇప్పటికీ అర్థం కావడం లేదు.. మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు!
- Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
- Nitesh Tiwari: ఆర్జీవీ 'శివ'తో మొదలైంది నా తెలుగు సినిమా పిచ్చి.. రామాయణ డైరెక్టర్!
1960ల ప్రారంభం నేపథ్యంలో, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఒక కల్పిత గ్రామం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రస్టిక్ డ్రామా, బలమైన భావోద్వేగాలు, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కలబోతగా వస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ విజువల్ వండర్‌గా ఉండనుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనుంది. తెలుగు, త్రిభాషా తదితర పాన్-ఇండియా భాషల్లో (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ) గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్న ‘భోగి’ టీమ్, ఈ భారీ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి కావడంతో ఫుల్ జోష్‌లో ఉంది. ఈ విజువల్ వండర్ సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి!
తాజావార్తలు
-
Mamitha Baiju: నేను హీరోయిన్.. ఇప్పటికీ అర్థం కావడం లేదు.. మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణం.. రూ.2 లక్షల ఆశ చూపి నా కొడుకును లాగారు..!
-
AB Venkateswara Rao: వంగవీటి రాధాపై ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది రాజకీయ పోరాటమే!
-
Hardik Pandya-Fan: 1000 కిలోమీటర్లకు పైగా నడిచాడు.. హార్దిక్ మనసు గెలిచాడు!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!