Mahela Jayawardene: “హార్దిక్ ఒక్కడే బాధ్యుడు కాదు”.. ముంబై వరుస ఓటములపై కోచ్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్(MI) ఒక్కసారిగా చెతికిల పడింది. ఈ సీజన్‌లో వరుసగా నాలుగు ఓటములు చవిచూసింది. ఈ అంశంపై తాజాగా ఆ జట్టు కోచ్ మహేల జయవర్ధనే మాట్లాడారు. పంజాబ్ కింగ్స్ (PBKS) చేతిలో ఘోర పరాజయం తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జయవర్ధనే జట్టు వైఫల్యాలపై స్పందించారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై వస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. జట్టు పరాజయాలకు కేవలం ఒక్క వ్యక్తిని బాధ్యుడిని చేయడం సరికాదని, మేనేజ్‌మెంట్ నుంచి ఆటగాళ్ల వరకు అందరం సమిష్టిగా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. “ఈ విఫల్యానికి కేవలం హార్దిక్ ఒక్కడే కారణం కాదు. మేమందరం బాధ్యులమే. జట్టు ప్రదర్శన సరిగ్గా లేనప్పుడు అది నా పైన, మేనేజ్‌మెంట్ పైనా ఉంటుంది. మెరుగైన ఫలితాల కోసం మేము ఎక్కడ తప్పు చేస్తున్నామో సమీక్షించుకోవాలి” అని జయవర్ధనే ధీమాగా చెప్పారు. ముంబై జట్టు నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నప్పటికీ.. ప్రత్యర్థి జట్లు మరింత క్లినికల్‌గా ఉండి పైచేయి సాధిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రత్యర్థి జట్ల కాన్ఫిడెన్స్ లెవల్స్ ఎక్కువగా ఉండటం ముంబైకి ఇబ్బందిగా మారిందని, తాము నియంత్రించగలిగే అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.
READ MORE: Israel-Lebanon: ఇజ్రాయెల్‌తో 10 రోజులు కాల్పుల విరమణ ఒప్పందం.. లెబనాన్‌లో సంబరాలు
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించినప్పటికీ, ఆ తర్వాత వరుస ఓటములతో ముంబై వెనకబడిపోయింది. కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాలంటే వచ్చే మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడం ఒక్కటే మార్గమని జయవర్ధనే పేర్కొన్నారు. ముఖ్యంగా రాబోయే విదేశీ మ్యాచ్‌లు జట్టుకు అత్యంత కీలకమని, అక్కడ గెలిచి మళ్ళీ రిథమ్‌లోకి రావాలని భావిస్తున్నట్లు తెలిపారు. పంజాబ్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. క్వింటన్ డికాక్ ఇచ్చిన అద్భుతమైన ఆరంభంతో తాము 210 నుంచి 220 పరుగులు చేస్తామని ఆశించినట్లు తెలిపారు. కానీ చివరి ఓవర్లలో తడబడటం వల్ల మొమెంటం కోల్పోయామని కోచ్ అంగీకరించారు. “చివరి దశలో మా బ్యాటర్లు రిథమ్ కోల్పోయారు, అలాగే బౌలింగ్‌లో మొదటి ఓవర్ నుండే పట్టు సాధించలేకపోయాము. దీనివల్ల మరో 20 పరుగులు తక్కువగా చేశాం. ఎగ్జిక్యూషన్ విషయంలో మేము చాలా బలహీనంగా ఉన్నాం, ఈ లోపాలను సరిదిద్దుకుని ముందుకు వెళ్తాం” అని జయవర్ధనే స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!