Israel-Lebanon: ఇజ్రాయెల్‌తో 10 రోజులు కాల్పుల విరమణ ఒప్పందం.. లెబనాన్‌లో సంబరాలు
- ఇజ్రాయెల్‌తో 10 రోజులు కాల్పుల విరమణ ఒప్పందం
- అమెరికా మధ్యవర్తిత్వంతో ఒప్పందం
- లెబనాన్‌లో ప్రజలు సంబరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొత్తానికి మధ్యప్రాచ్యంలో వాతావరణం చల్లబడుతోంది. తాజాగా ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అమెరికా మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం జరిగింది. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు చక్కబడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే కాల్పుల విరమణ ఒప్పందం జరగగానే లెబనీయులు వీధుల్లోకి వచ్చి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Trump: ఇరాన్ యురేనియంపై ట్రంప్ సంచలన ప్రకటన
Also Read
అయితే తాత్కాలిక ఒప్పందం జరిగినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. దక్షిణ లెబనాన్‌లో 10 కిలోమీటర్లలో భద్రతా మండలం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. ఇదిలా ఉంటే కాల్పుల విరమణ అమల్లోకి రావడానికి కొద్దిసేపటి ముందు కూడా ఇరుపక్షాలు భారీ దాడులు చేసుకున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని వందలాది లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠగానే ఉంది.
ఇది కూడా చదవండి: Fly Over: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి..
ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణను అంగీకరించేందుకు సిద్ధంగానే ఉన్నామని.. అయితే లెబనాన్ భూభాగంలో ఇజ్రాయెల్ ఉనికిని ఏ మాత్రం అంగీకరించబోమని హిజ్బుల్లా తెలిపింది. లెబనాన్‌లో కాల్పుల విరమణ అమలు చేసి.. ఇజ్రాయెల్ ఉనికిని పూర్తిగా అంతం చేస్తే తప్ప శాంతిని నెలకొల్పడం కష్టమని ఇరాన్ కూడా వాదించినట్లుగా తెలుస్తోంది.
10 రోజుల కాల్పుల విరమణ సమయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఎలాంటి కాల్పులు మళ్లీ జరగకపోతే దీర్ఘకాలిక శాంతి ఒప్పందానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కవ్వించినా పరిస్థితులు మళ్లీ మొదటికొస్తాయి. ఇదిలా ఉంటే కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు లెబనాన్, ఇజ్రాయెల్ నాయకులను వైట్‌హౌస్‌కు రావాలని ట్రంప్ ఆహ్వానించారు.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!