RCB Vs GT: “అతడిని ఆడిస్తే RCB ఓడిపోవడం ఖాయం”.. ఫైనల్‌కు ముందు మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్ (GT), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడుతున్న నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్సీబీ యాజమాన్యానికి ఆయన ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్‌ను ఫైనల్ మ్యాచ్ తుది జట్టులోకి తీసుకోకూడదని ఆయన కోరారు.
తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన శ్రీకాంత్.. “ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోవడానికి ఒకే ఒక్క అవకాశం ఉంది. అదే షెపర్డ్‌తో మూడు ఓవర్లు బౌలింగ్ చేయించడం. ఒకవేళ అతడు గనుక మూడు ఓవర్లు వేస్తే, ఆర్సీబీ చేతుల్లోంచి మ్యాచ్ చేజారిపోతుంది. ఈ సీజన్లో అతడు 7 వికెట్లు తీసినప్పటికీ, 12 కంటే ఎక్కువ ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నాడు. అందుకే అతడిని అస్సలు ఆడించకూడదు” అని విశ్లేషించారు. అలాగే ఫిలిప్ సాల్ట్ జట్టులోకి అందుబాటులోకి వచ్చినప్పటికీ, మంచి ఫామ్‌లో ఉన్న వెంకటేష్ అయ్యర్‌నే కొనసాగించాలని సూచించారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
మరోవైపు గుజరాత్ టైటాన్స్ విజయావకాశాలపై కూడా శ్రీకాంత్ మాట్లాడారు. జీటీ గెలవాలంటే ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, పడిక్కల్‌ల భాగస్వామ్యాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విడదీయాలని చెప్పారు. కోహ్లీ కేవలం 40 పరుగులు చేసినా ఆర్సీబీ గెలిచేస్తుందని, కాబట్టి కోహ్లీ, పడిక్కల్, రజత్ పటిదార్‌లలో కనీసం ఇద్దరిని పవర్‌ప్లేలోనే అవుట్ చేస్తేనే గుజరాత్‌కు గెలిచే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇందుకోసం జీటీ బౌలర్లు కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్ కలిసికట్టుగా రాణించాల్సి ఉంటుందని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్‌చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!