KL Rahul IPL Record: ఐపీఎల్లో కోహ్లీకే సాధ్యం కాని ఘనత.. చరిత్ర సృష్టించిన రాహుల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL Rahul IPL Record: ఐపీఎల్, టీ20 క్రికెట్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది కింగ్ కోహ్లీ. కోహ్లీ టీ20 క్రికెట్లో అనేక అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు. కానీ.. కోహ్లీని మించిన ప్లేయర్ ఒకరు ఉన్నాడు. ఎవరో కాదు.. కేఎల్ రాహుల్. ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన రాహుల్, ఢిల్లీ ఫ్రాంచైజీ తరఫున 1000 పరుగుల మార్కును దాటాడు. తక్కువ స్కోరుకే అవుటైనప్పటికీ, ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఒక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మూడు వేర్వేరు ఐపీఎల్ ఫ్రాంచైజీల తరఫున 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. గతంలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల తరఫున ఈ ఘనత సాధించిన రాహుల్, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున సైతం ఆ మైలురాయిని అందుకున్నాడు.
వేర్వేరు ఫ్రాంచైజీల్లో రాహుల్ పరుగులు:
పంజాబ్ కింగ్స్ : 55 మ్యాచులు : 2548 : పరుగులు
లక్నో సూపర్ జెయింట్స్ : 38 మ్యాచులు : 1410 పరుగులు
ఢిల్లీ క్యాపిటల్స్ : 24 మ్యాచులు : 1007 పరుగులు
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇక, నిన్నటి మ్యాచ్‌లోని ఆరో ఓవర్లో కార్తీక్ త్యాగి వేసిన బంతిని బౌండరీగా మలచడం ద్వారా రాహుల్ ఈ వేయి పరుగుల ఘనతను పూర్తి చేశాడు. అంతేకాకుండా, ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అత్యంత వేగంగా (కేవలం 23 ఇన్నింగ్స్‌ల్లో) 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా రాహుల్ నిలిచాడు. గతంలో రిషబ్ పంత్, జేపీ డుమిని 35 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్కును అందుకోగా, రాహుల్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.
ఒక ఫ్రాంచైజీ తరఫున అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ప్లేయర్స్
క్రిస్ గేల్ : RCB : 20 ఇన్నింగ్స్‌లు
షాన్ మార్ష్ : PBKS : 21: ఇన్నింగ్స్‌లు
లెండిల్ సిమన్స్ : MI : 23 ఇన్నింగ్స్‌లు
కేఎల్ రాహుల్: PBKS : 23 ఇన్నింగ్స్‌లు
కేఎల్ రాహుల్ : DC : 24 ఇన్నింగ్స్‌లు
డెవాన్ కాన్వే : CSK : 24 ఇన్నింగ్స్‌లు
ఇక, ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్లో రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌పై చేసిన 152 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఈ సీజన్లో రాహుల్ ఫామ్‌కు నిదర్శనం. ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 180 స్ట్రైక్ రేట్‌తో 468 పరుగులు చేసిన రాహుల్, ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-3 బ్యాటర్లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. తన అగ్రెసివ్ బ్యాటింగ్‌తో ఢిల్లీ జట్టుకు వెన్నెముకగా మారాడు.
తాజావార్తలు
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
-
BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!