Kedar Jadhav: సచిన్‌తో పోలికలా? 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై కేదార్ జాదవ్ సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kedar Jadhav: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడుతున్న 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్యవంశీని లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో పోల్చడంపై జాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. Olympics.comకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పష్టత ఇచ్చాడు. సచిన్ టెండూల్కర్‌తో ఎవరినీ పోల్చలేమని, ఆయన క్రికెట్‌కు అందించిన సేవలు అసమానమని జాదవ్ పేర్కొన్నాడు. “సచిన్ ఒక మాస్టర్.. ఆయన దరిదాపుల్లోకి ఎవరూ రాలేరు. లెజెండ్స్ అంటే కేవలం రికార్డులు, గణాంకాలు మాత్రమే కాదు, దశాబ్దాల పాటు ఆటను తమ భుజాలపై మోస్తూ కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన గొప్ప వ్యక్తులు” అని కొనియాడాడు. సచిన్ 20-25 ఏళ్ల పాటు నిలకడగా రాణించడమే కాకుండా, విపరీతమైన ఒత్తిడిని తట్టుకుని అంచనాలను అందుకున్నారని గుర్తు చేశాడు.
వైభవ్ సూర్యవంశీ నిస్సందేహంగా ప్రతిభావంతుడని, ఈ చిన్న వయసులోనే అద్భుతమైన సంకేతాలు చూపిస్తున్నాడని జాదవ్ అంగీకరించాడు. అయితే, ఇంత త్వరగా పోలికలు మొదలుపెడితే అది ఆ ఆటగాడిపై అనవసరమైన ఒత్తిడిని పెంచుతుందని హెచ్చరించాడు. “ఒక యువ ఆటగాడిని లెజెండ్‌తో పోల్చినప్పుడు, అతను ఆడే ప్రతి ఇన్నింగ్స్ ఒక పరీక్షలా మారుతుంది. ప్రతిసారీ అతను గొప్పగా ఆడాలని జనం ఆశిస్తారు, ఇది ఆటగాడి ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది” అని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు.. యంగ్ సెన్సేషన్ సూర్యవంశీకి జాదవ్ ఓ ముఖ్యమైన సలహా ఇచ్చాడు. సాధ్యమైనంత వరకు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించాడు. సోషల్ మీడియాలో వచ్చే అతిగా పొగిడే మాటలు లేదా విమర్శలు యువ ఆటగాళ్ల మనస్తత్వంపై ప్రభావం చూపుతాయని, కేవలం ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలని కోరాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
“మరో సచిన్ కోసం వెతకడం మానేసి, ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లు భవిష్యత్తులో ఏం కాగలరో చూడండి. అప్పుడే ఆట ముందుకు సాగుతుంది” అని జాదవ్ అభిమానులకు పిలుపునిచ్చాడు. మారుతున్న ఫార్మాట్లు, ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ఆటగాళ్ల శైలి మారుతుందని, లెజెండ్స్‌ను గౌరవిస్తూనే యువ ఆటగాళ్లకు అండగా ఉండాలని కోరాడు. ఇకఐపీఎల్ చరిత్రలో అతి చిన్న వయసులో (15 ఏళ్లు) ఆడుతున్న ఆటగాడు. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. బుమ్రా, హేజిల్‌వుడ్ వంటి దిగ్గజ బౌలర్లను సైతం ధైర్యంగా ఎదుర్కొని సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. 10 ఇన్నింగ్స్‌లు ఆడిన వైభవ్ 404 పరుగులు సాధించాడు. సగటు: 40.40, స్ట్రైక్ రేట్: 237.64తో కొనసాగుతున్నాడు.
తాజావార్తలు
-
9/11 Attacks: 2,976 మంది ప్రాణాలు బలిగొన్న ఉగ్రదాడులు.. వెలుగులోకి సౌదీ మాజీ ఏజెంట్ షాకింగ్ వీడియోలు..
-
Astrology: సెప్టెంబర్ 8 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Dhanush Mythological Film: ధనుష్ కోసం రాజమౌళి తండ్రి రంగంలోకి.. భన్సాలీ సినిమాకు పౌరాణిక కథ!
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!