Kedar Jadhav: భారత మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గతేడాది క్రికెట్ అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన జాదవ్, ఇప్పుడు రాజకీయ మైదానంలోకి అడుగుపెట్టారు. 40 ఏళ్ల కేదార్ జాదవ్ మంగళవారం ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ పెద్దల సమక్షంలో అధికారికంగా చేరారు. మహారాష్ట్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే ఆయనను పార్టీలోకి స్వాగతించారు.