IPL 2026: ఓటమి లేకుండా దూసుకెళ్తున్న పంజాబ్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు ప్రస్తుతం తిరుగులేని ఫామ్‌లో ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అభిమానులను అలరిస్తోంది. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం విశేషం. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు నమోదు చేయగా, ఒక మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ ప్లేఆఫ్స్ దిశగా దూసుకుపోతున్న పంజాబ్ జట్టుకు ఇప్పుడు ఒక ఎదురుదెబ్బ తగిలింది.
ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున బ్యాటింగ్‌లో చెలరేగిపోతున్న ఆస్ట్రేలియా యువ సంచలనం కూపర్ కొన్నోలీ జట్టును వీడి అర్ధాంతరంగా ఆస్ట్రేలియాకు పయనమయ్యాడు. వెన్ను గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న అతనికి, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీలక సూచనలు చేసింది. ఏప్రిల్ నెలాఖరు వరకు అతడిని కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఆడాలని, బౌలింగ్ చేయవద్దని స్పష్టం చేసింది. అయితే.. తాజాగా తన బౌలింగ్ ఫిట్నెస్ను పరీక్షించుకోవడానికి, పూర్తిస్థాయి వైద్య పరీక్షల కోసం అతను ఆస్ట్రేలియా వెళ్ళినట్లు సమాచారం.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఈ సీజన్లో కొన్నోలీ పంజాబ్ జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌పై 72 పరుగులు, లక్నో సూపర్ జెయింట్స్‌పై 87 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే ముఖ్యమైన మ్యాచ్‌కు కేవలం మూడు రోజుల ముందు అతను జట్టుకు దూరం కావడం పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ను కొంత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే అతను కేవలం ఫిట్నెస్ క్లియరెన్స్ కోసమే వెళ్ళాడని.. త్వరలోనే తిరిగి జట్టుతో చేరుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!