MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన 47వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్లు భారీ స్కోరు సాధించారు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన రోహిత్ శర్మ, ఈ మ్యాచ్‌లో తిరిగి జట్టులోకి వచ్చి బాధ్యతాయుతంగా ఆడాడు. ఓపెనర్ రియాన్ రికెల్టన్ 32 బంతుల్లో 83 పరుగులు చేసి అవుట్ కాగా.. రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి 44 బంతుల్లో 84 పరుగులు చేసి మహహ్మద్ షమీ బౌలింగ్‌లో పెవిలియన్ కు చేరాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 143 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముంబై ఇండియన్స్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యాల జాబితాలో ఇది ఐదవ స్థానంలో నిలిచింది.
ఈ ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ శర్మ కొన్ని కీలక రికార్డులను నమోదు చేశాడు. రోహిత్ తన హాఫ్ సెంచరీని 27 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు, ఇది అతడి ఐపీఎల్ కెరీర్లో నాలుగో వేగవంతమైన అర్ధ సెంచరీ. గతంలో కోల్‌కతాపై 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రికార్డు కూడా రోహిత్ పేరిట ఉంది. అలాగే, ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక సార్లు (3 సార్లు) 100+ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడిగా రోహిత్ శర్మ మరియు రియాన్ రికెల్టన్ రికార్డు సృష్టించారు. గతంలో రోహిత్ – ఇషాన్ కిషన్, పార్థివ్ పటేల్ – లెండిల్ సిమన్స్ వంటి జోడీలు రెండుసార్లు మాత్రమే ఈ ఘనత సాధించాయి.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ముంబై ఇండియన్స్ 14 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ప్రస్తుతం ముంబై విజయం సాధించాలంటే 35 బంతుల్లో 51 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్ తో పాటు తిలక్ వర్మ ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రికెల్టన్ 8 సిక్సర్లు, రోహిత్ 7 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
తాజావార్తలు
-
ED: ఈడీ సంచలన చర్య.. తొలిసారి విమానం వేలం.. చాలా చీఫ్‌గా విక్రయం
-
Dhruv Rathee: రాముడు-సీతలపై వ్యాఖ్యలు.. ధ్రువ్ రాఠీ వీడియో తొలగింపుపై హైకోర్టు డెడ్‌లైన్
-
Bhatti Vikramarka : దమ్ముంటే చర్చకు రండి.. కేసీఆర్ కు భట్టి ఓపెన్ ఛాలెంజ్.!
-
Pakistan: ‘‘దౌత్యం కడుపు నింపదు’’.. పాక్ పరువు తీసిన సింగపూర్ దౌత్యవేత్త..
-
Gold Scheme: బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం!.. కొత్త స్కీమ్ ప్రకటనకు రంగం సిద్ధం!
ట్రెండింగ్
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్‌కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!