Axar Patel: “ఈసారి కప్పు ఎస్ఆర్హెచ్దే.. వాళ్లను ఆపడం ఎవ్వరి వల్ల కాదు”.. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Axar Patel: ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠభరితంగా ముగిసింది. లీగ్ స్టేజ్ ముగిసే సమయానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లేఆఫ్స్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుచుకునే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశాడు. లీగ్ దశలో తమ చివరి మ్యాచ్ ముగిసిన తర్వాత అక్షర్ మాట్లాడుతూ… సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ అత్యంత ప్రమాదకరమైనదని, ప్లేఆఫ్స్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు గనుక విజృంభిస్తే వారిని అడ్డుకోవడం ఏ జట్టుకైనా చాలా కష్టమని హెచ్చరించాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టేబుల్ టాపర్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 55 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఈ సీజన్ లోనే అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో మే 27న న్యూ చండీగఢ్‌లోని ముల్లన్పూర్ స్టేడియంలో జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ముగిసిన అనంతరం బ్రాడ్‌కాస్టర్‌తో అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. “SRH చాలా బలమైన జట్టు అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా వారి టాప్-3 బ్యాటర్లు విజృంభిస్తే, ఆ జట్టును ఓడించడం ఎవరికైనా సాధ్యం కాదు” అని పేర్కొన్నారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇక, ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 14 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. టోర్నమెంట్ మధ్యలో వరుస ఓటములతో కుదేలైన ఢిల్లీ.. ఆ తర్వాత కోలుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. లీగ్ చివర్లో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి సానుకూల ముగింపు పలికినప్పటికీ, టాప్-4 లోకి దూసుకెళ్లడానికి ఆ పాయింట్లు సరిపోలేదు. దీంతో వరుసగా ఐదో ఏడాది కూడా ఢిల్లీ ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. ఇక, తమ జట్టు ప్రదర్శనపై స్పందించిన అక్షర్ పటేల్.. టోర్నమెంట్లో కీలక సమయాల్లో వచ్చిన అవకాశాలను తాము చేజార్చుకున్నామని అంగీకరించాడు. “మనం చేసిన తప్పులను ఒప్పుకున్నప్పుడే, ఇంకా ఏం చేయాలో అర్థమవుతుంది. ఒకటి రెండు మ్యాచ్‌లలో ఓటమి సహజమే. మేము మంచి క్రికెట్ ఆడాము, కానీ ఆ ఒకటి రెండు మ్యాచ్‌లలోని కీలక క్షణాలను మాకు అనుకూలంగా మార్చుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేది” అని అక్షర్ అన్నాడు.
తాజావార్తలు
-
Vivo V80: వివో V80 Series ధర లీక్.. 7200mAh బ్యాటరీ, Snapdragon 7 Gen 4తో భారత్‌లో త్వరలో లాంచ్?
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
Shravana Maasam: శ్రావణ మాస మహోత్సవం.. జూలై 30నా లేక 31నా? శివయ్య భక్తులు నోట్ చేసుకోవాల్సిన పవిత్ర తిథులు ఇవే!
-
Suriya Remuneration: ‘కరుప్పు’ సక్సెస్‌తో 100 కోట్ల క్లబ్‌లోకి సూర్య?
-
Pakistan Cargo Plane Missing: ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న పాకిస్తానీ కార్గో విమానం.. అరేబియా సముద్రంపై గల్లంతు
ట్రెండింగ్
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!