IPL 2027: ఐపీఎల్ 2026 తర్వాత భారీ మార్పులు.. కెప్టెన్స్, కోచ్‌లు మూల్యం చెల్లించుకోక తప్పదు!
- మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్న ఫ్రాంచైజీలు
- కెప్టెన్స్, కోచింగ్ స్టాఫ్, కీలక ఆటగాళ్ల భవిష్యత్తుపై ఊహాగానాలు
- ఎంఎస్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Decisions Across Teams Ahead of IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటుండగా.. తదుపరి సీజన్ కోసం ఫ్రాంచైజీలు పెద్ద ఎత్తున మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నాయనే వార్తలు క్రికెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్స్, కోచింగ్ స్టాఫ్, కీలక ఆటగాళ్ల భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు జట్లలో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి తెలుసుకుందాం.
ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్:
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎన్నో విజయాలు అందించిన ధోనీ.. ఈ సీజన్ అనంతరం తన ఐపీఎల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని సమాచారం. అతని స్థానంలో కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలని జట్టు యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
గైక్వాడ్ కెప్టెన్సీపై సందేహాలు:
చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతడిని బాధ్యతల నుంచి తప్పించి.. సంజు శాంసన్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించే అవకాశాలపై చర్చ జరుగుతోంది. ఇది నిజమైతే సీఎస్‌కేలో పెద్ద మార్పుగా భావించాలి.
మేనేజ్‌మెంట్‌లో కూడా మార్పులు:
పలు జట్ల మేనేజ్‌మెంట్‌లో కూడా మార్పులు ఉండవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్, కోచ్ లక్ష్మీపతి బాలాజీలను బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉందని సమాచారం. అలాగే సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్‌పై కూడా ఒత్తిడి పెరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పంత్, రహానేలపై వేటు:
కెప్టెన్ రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ జట్టు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అతని ప్రదర్శన, జట్టు సమతుల్యతపై మేనేజ్‌మెంట్ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌లో అజింక్య రహానే, కోచ్ అభిషేక్ నాయర్ స్థానాలు ప్రమాదంలో ఉన్నాయని సమాచారం. జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడం ఈ నిర్ణయాలకు కారణమవుతోంది.
హార్దిక్, పరాగ్ అవుట్:
రాజస్థాన్ రాయల్స్‌లో కూడా పెద్ద మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. రియాన్ పరాగ్‌ను జట్టు నుంచి తప్పించి.. యువ స్టార్ యశస్వి జైస్వాల్‌కు కెప్టెన్సీ అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ముంబై ఇండియన్స్‌లో కూడా కెప్టెన్సీ మార్పు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యను బాధ్యతల నుంచి తప్పించి.. స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ అప్పగించే అవకాశాలపై చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Kunal Shah: భారతీయ టెక్ దిగ్గజానికి కీలక బాధ్యతలు.. వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా కునాల్ షా నియామకం
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. రూ.30,515 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి కొత్త ఊపు..!
-
Veerabhadruni Rahasyam : గుడి గంట మోగితే శవం లేవాల్సిందేనా? ఓటీటీలోకి భయపెట్టే ‘వీరభద్రుని రహస్యం’
-
Lucknow Tragedy: లక్నో విషాదంపై కన్నీళ్లు పెట్టుకున్న డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్
-
Fast Food Side Effects: పళ్ల సమస్యల నుంచి క్యాన్సర్ వరకు.. ఫాస్ట్ ఫుడ్ ప్రభావం.. నిపుణుల హెచ్చరిక
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!