Lucknow Tragedy: లక్నో విషాదంపై కన్నీళ్లు పెట్టుకున్న డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్
- లక్నో కోచింగ్ సెంటర్లో ఘోర విషాదం
- భారీ అగ్నిప్రమాదంలో 15 మంది చిన్నారులు సజీద దహనం
- విషాదంపై కన్నీళ్లు పెట్టుకున్న డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కోచింగ్ సెంటర్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. బిల్డింగ్‌లో అంటుకున్న మంటలు.. క్షణాల్లోనే మంటలు భవనం అంతటా వ్యాపించాయి. దీంతో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు మంటల్లో కాలి బూడిదయ్యారు. దాదాపు 15 మంది సజీవ దహనం అయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక ఈ ఘటనపై డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ తీవ్ర దు:ఖానికి గురయ్యారు. ప్రాణాలు కోల్పోయిన అమాయకుల పట్ల సంతాపం తెలుపుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు సంయమనాన్ని కోల్పోయి.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. ఆద్యంతం కన్నీటి పర్యంతం అయ్యారు. ‘నేను 14 మృతదేహాలను నా కళ్లారా చూశాను.’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చారు.
Also Read
- Delhi Building Collapse: "రక్షించండి".. బిల్డింగ్ శిథిలాల కింద నుంచి విద్యార్థుల ఫోన్ కాల్స్..
- Chennai Second Airport: చెన్నైకి కొత్త ఎయిర్‌పోర్టు.. విజయ్ సర్కార్ కీలక ప్రతిపాదనలు..
- Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
- New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
ఘటన జరిగిన సమయంలో యానిమేషన్ కేంద్రంగా పనిచేస్తోందని.. అక్కడ 15, 16, 17 ఏళ్ల పిల్లలు వేసవి సెలవుల్లో కార్టూన్ మేకింగ్, యానిమేషన్ నేర్చుకోవడానికి వచ్చారని డిప్యూటీ సీఎం తెలిపారు.
మంటలు చెలరేగిన వెంటనే పిల్లలు తమను తాము కాపాడుకోవడానికి వెనుక వైపుకు పరుగెత్తారు. ఆ కేంద్రం లోపల చాలా చెక్క ఫర్నిచర్ ఉంది. ఆ మంటల వల్ల వెలువడిన దట్టమైన, విషపూరితమైన పొగ పిల్లలను చుట్టుముట్టడంతో వారు బయటకు రాలేకపోయారన్నారు. ఇప్పటివరకు 15 మంది పిల్లల మృతదేహాలు లభ్యం కాగా.. వారిలో 14 మందిని ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పారు. గాయాలతో ఉన్న పిల్లలను చికిత్స కోసం వెంటనే కేజీఎంసీ ట్రామా సెంటర్‌కు తరలించారు.
ఇక ఈ ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అలీగఢ్‌లో తన షెడ్యూల్ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించారు.ఇదిలా ఉంటే ఇదే నెలలో ఢిల్లీ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 12 మంది విదేశీయులు ఉన్నారు.
#WATCH | On the Lucknow coaching institute fire incident, Uttar Pradesh Deputy CM Brajesh Pathak says, "A total of thirteen children have just been brought out. They have all been sent to the hospital. It is a major incident. There is smoke inside. Every single item is being… pic.twitter.com/M8svb1a2FN
— ANI (@ANI) June 22, 2026
#WATCH | Uttar Pradesh Deputy CM Brajesh Pathak breaks down as he speaks on the Lucknow coaching institute fire incident.
He says, "I have seen 14 bodies with my own eyes." pic.twitter.com/WuLhFpXIUw
— ANI (@ANI) June 22, 2026
#WATCH | Lucknow coaching institute fire incident | Bodies being taken from the coaching centre where a fire broke out in Lucknow's Aliganj.
Uttar Pradesh Deputy CM Brajesh Pathak and other officials are present at the fire accident site pic.twitter.com/I2adEPtruJ
— ANI (@ANI) June 22, 2026
PM Modi anguished by the loss of lives in a fire accident in Lucknow, Uttar Pradesh, announces ex-gratia of Rs 2 lakh to the next of kin of each deceased and Rs 50,000 to the injured pic.twitter.com/u9nKkvd8tp
— ANI (@ANI) June 22, 2026
తాజావార్తలు
-
Mokshagna: బరిలోకి సింబా.. బాలయ్య ఆశీస్సులతో మోక్షజ్ఞ మాస్ ఎంట్రీ!
-
Delhi Building Collapse: “రక్షించండి”.. బిల్డింగ్ శిథిలాల కింద నుంచి విద్యార్థుల ఫోన్ కాల్స్..
-
‘Panchanama’ Trailer: ఆ మూడు మరణాలు ప్రమాదాలు కావు.. పక్కా స్కెచ్‌తో జరిగిన హత్యలు
-
Chennai Second Airport: చెన్నైకి కొత్త ఎయిర్‌పోర్టు.. విజయ్ సర్కార్ కీలక ప్రతిపాదనలు..
-
KCR: ఆ బూతుల వీరుడుతో చర్చలా?.. లక్ష మందితో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల దగ్గరకు వెళ్దాం
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!