Kunal Shah: భారతీయ టెక్ దిగ్గజానికి కీలక బాధ్యతలు.. వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా కునాల్ షా నియామకం
- భారతీయ టెక్ దిగ్గజానికి కీలక బాధ్యతలు
- వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా నియామకం
- కునాల్ షా నియామకంపై మార్క్ జుకర్‌బర్గ్ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ భారతీయ క్రెడ్ వ్యవస్థాపకుడు, టెక్ దిగ్గజం కునాల్ షాకు కీలక పదవి దక్కింది. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన వాట్సాప్‌కు కొత్త గ్లోబల్ హెడ్‌గా కునాల్ షా నియమితులయ్యారు. ఈ విషయాన్ని మెటా అధికారికంగా ప్రకటించింది. 2019 నుంచి వాట్సాప్‌ను నడిపిస్తున్న విల్ క్యాత్‌కార్ట్ స్థానంలో కునాల్ షా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న వాట్సాప్, మెసేజింగ్ సేవలకు మాత్రమే పరిమితం కాకుండా చెల్లింపులు, వ్యాపార సేవలు, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఫీచర్లతో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో తదుపరి వృద్ధి దశకు నాయకత్వం వహించేందుకు కునాల్ షా సరైన వ్యక్తిగా మెటా భావించింది. మెటా ప్రకారం.. కునాల్ షాకు ఉత్పత్తుల అభివృద్ధి, వినియోగదారుల అవసరాలపై లోతైన అవగాహన ఉంది. ముఖ్యంగా వాట్సాప్‌కు అతిపెద్ద మార్కెట్ అయిన భారత్‌లో యాప్ వినియోగం, డిజిటల్ చెల్లింపులు, బిజినెస్ మెసేజింగ్ రంగాలపై ఆయనకు ఉన్న అనుభవం సంస్థకు ఉపయోగపడుతుందని పేర్కొంది.
Also Read
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
- Explainer: అక్కడికి పోతే... అటు నుంచి అటే పోతారు..!
- Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. 'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం'
ఈ నియామకాన్ని ప్రకటిస్తూ మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రశంసలు కురిపించారు. ‘‘కునాల్ షా మెటాలో చేరి వాట్సాప్‌కు తదుపరి నాయకత్వం వహించనున్నారు. క్రెడ్‌ను భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన టెక్నాలజీ కంపెనీల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్‌ను ముందుకు నడిపించడానికి అవసరమైన సృజనాత్మక దృక్పథం, అంతర్జాతీయ అవగాహన ఆయనకు ఉన్నాయి. బిలియన్ల మంది వినియోగదారులు, లక్షలాది వ్యాపారాల కోసం వాట్సాప్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దడంలో ఆయనతో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
మెటా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ క్రిస్ కాక్స్ కూడా కునాల్ షా నియామకాన్ని స్వాగతించారు. ‘‘కునాల్ షా భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన పారిశ్రామికవేత్తల్లో ఒకరు. టెక్నాలజీ ఉత్పత్తులు ప్రజల జీవితాల్లో ఎలా సానుకూల మార్పు తీసుకురాగలవో ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. వాట్సాప్ తదుపరి దశ అభివృద్ధికి ఆయన నాయకత్వం ఎంతో కీలకం అవుతుంది.’’ అని తెలిపారు. క్రెడ్ వ్యవస్థాపకుడిగా కునాల్ షా ఇప్పటికే భారత స్టార్టప్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇప్పుడు వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా బాధ్యతలు స్వీకరించడం భారత టెక్నాలజీ రంగానికి మరో గర్వకారణంగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
-
CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
-
Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు