KKR Playoffs Scenario: ఇకపై కేకేఆర్‌కు చావోరేవో.. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే చివరి వరకు పోరాడాల్సిందే!
- అద్భుత కంబ్యాక్‌తో ప్లేఆఫ్స్ రేసులోకి కేకేఆర్
- వరుసగా నాలుగు విజయాలతో ప్లేఆఫ్స్ ఆశలు సజీవం
- ఇకపై కేకేఆర్‌కు చావోరేవో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అద్భుత కంబ్యాక్‌తో ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. సీజన్ ప్రారంభంలో తొలి ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓడిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేకేఆర్.. ఇప్పుడు వరుసగా నాలుగు విజయాలతో ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే.. కేకేఆర్ గరిష్టంగా 17 పాయింట్లకు చేరుకుంటుంది. సాధారణంగా 16 పాయింట్లు ప్లేఆఫ్స్‌కు సేఫ్ జోన్‌గా భావిస్తారు. దీంతో ఐపీఎల్ 2026లో కేకేఆర్‌కు ఇంకా అవకాశాలు పూర్తిగా ముగిసిపోలేదు.
ఈరోజు రాయ్‌పూర్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగబోయే మ్యాచ్ కేకేఆర్‌కు అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్స్ ఆశలు మరింత బలపడతాయి. ఓడిపోతే మాత్రం పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. అప్పుడు తమ కంటే పైస్థానాల్లో ఉన్న జట్లు వరుసగా ఓడిపోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు కనీసం రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. అంతేకాకుండా నెట్ రన్‌రేట్ కూడా కేకేఆర్‌కు కీలకంగా మారనుంది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆర్సీబీ 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా 14 పాయింట్లతో బలమైన స్థితిలో ఉంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లు.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ 12 పాయింట్లతో కేకేఆర్‌కు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 10 పాయింట్లతో ఇంకా రేసులోనే ఉంది. దీంతో ఈసారి ప్లేఆఫ్స్ పోరు చివరి వరకు ఉత్కంఠగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
2022 నుంచి చూస్తే.. 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. 2022లో ఆర్సీబీ, 2023లో ముంబై ఇండియన్స్, 2025లో కూడా ముంబై 16 పాయింట్లతో టాప్-4లో నిలిచాయి. అయితే 2024లో మాత్రం నాలుగు జట్లు 14 పాయింట్లతో సమంగా నిలవగా.. మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరింది. ప్రస్తుతం కూడా నెట్ రన్‌రేట్ కీలక పాత్ర పోషించే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో కేకేఆర్‌కు ప్రతి మ్యాచ్ ‘డూ ఆర్ డై’గా మారింది. వరుస విజయాలతో జోష్‌లో ఉన్న కోల్‌కతా జట్టు అదే జోరును కొనసాగిస్తే ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే చిన్న తప్పిదం చేసినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
తాజావార్తలు
-
Israe-Lebanon: లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
-
CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
-
Bankra mosque: కోల్‌కతా ఎయిర్‌పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
-
VBSA Bill: పార్లమెంట్‌లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
-
S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!