IPL 2026 Playoffs: 22 రోజులు టాప్‌లో ఉన్నా నో యూస్.. ఒక్కరోజే టేబుల్ టాపర్‌గా ఉండి ప్లేఆఫ్స్‌కు అర్హత!
- అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన పీబీకేఎస్
- వరుసగా ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్
- చివరకు ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయిన పంజాబ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab Kings IPL 2026 Points Table: ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ప్రయాణం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని జట్టు సీజన్ ఆరంభంలో అద్భుత ప్రదర్శన చేసి వరుసగా ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మొత్తం 22 రోజుల పాటు టాప్‌లో కొనసాగిన పంజాబ్.. చివరకు ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోవడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో టైటిల్ ఫేవరెట్‌గా కనిపించిన పంజాబ్ కింగ్స్.. ఆ తర్వాత పూర్తిగా గాడి తప్పింది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై తీవ్ర ఒత్తిడిలో పడింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. చివరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించినప్పటికీ.. 14 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లతో ఐదో స్థానంలోనే నిలిచి ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఈ సీజన్లో ఎక్కువ రోజులు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగిన జట్లలో పంజాబ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆర్సీబీ 18 రోజులు టాప్‌లో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ 13 రోజులు, సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 రోజులు అగ్రస్థానంలో నిలిచాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే గుజరాత్ టైటాన్స్ కేవలం ఒక రోజు మాత్రమే టేబుల్ టాపర్‌గా ఉన్నప్పటికీ.. చివరకు రెండో స్థానంతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఇక ఇప్పుడు అందరి దృష్టి క్వాలిఫయర్-1పై పడింది. ఈరోజు ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోనుండగా.. ఓడిన జట్టుకు మరో అవకాశం లభించనుంది. ఈ సీజన్లో ఆర్సీబీ అత్యంత నిలకడైన జట్టుగా గుర్తింపు తెచ్చుకుంది. కెప్టెన్ రజత్ పాటీదార్ నాయకత్వంలో ఆర్సీబీ అదరగొట్టింది. దూకుడైన బ్యాటింగ్, పటిష్టమైన బౌలింగ్ ప్రదర్శనతో దుమ్మురేపుతోంది. విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉండగా.. జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా అవే మ్యాచ్‌ల్లో గెలిచే సామర్థ్యం ఆర్సీబీకి అదనపు బలంగా మారింది.
మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్లో బౌలింగ్ బలంతోనే ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ, ప్రసిద్ధ్ కృష్ణ కొత్త బంతితో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టగా.. రషీద్ ఖాన్, ఆర్ సాయి కిశోర్ మధ్య ఓవర్లలో పరుగులను కట్టడి చేశారు. బ్యాటింగ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ నిలకడగా రాణిస్తూ జట్టుకు విజయాలు అందించారు. చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 89 పరుగుల భారీ విజయంతో జీటీ మంచి జోరులో ఉంది. రెండు సమాన బలాలున్న జట్లు తలపడుతుండటంతో క్వాలిఫయర్-1 అభిమానులకు పూర్తి స్థాయి క్రికెట్ థ్రిల్లర్‌గా మారే అవకాశముంది.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!