Ind-Pak Tensions To Impact IPL: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తామ్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భారత్ లో జరుగుతున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే.. దాని ప్రభావం ఐపీఎల్ పై పడుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో కూడా ఇలాంటి పరిణామాలు జరిగినప్పటికీ.. ఎప్పుడు కూడా క్యాష్ రిచ్ లీగ్ పూర్తిగా రద్దు కాలేదు.. మే 25వ తేదీ వరకు జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ కొనసాగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వర్గాలు వెల్లడించాయి. కాగా, ప్రస్తుత పరిస్థితులు ఐపీఎల్ మ్యాచ్‌లపై ఎటువంటి ప్రభావం చూపవని బీసీసీఐ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందన్నారు.
అయితే, భారత్ లో 2008లో ప్రారంభమైన ఐపీఎల్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. 2009లో ఇండియాలో లోక్‌సభ ఎన్నికల ఉండటంతో భద్రతా పరమైన సమస్యలు వస్తాయని చెప్పడంతో తొలిసారి దక్షిణాఫ్రికాలో లీగ్ నిర్వహించారు. ఆ తర్వాత 2014 సీజన్‌లో మరోసారి లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు మొదటి దశ షెడ్యూల్ UAEలో జరిగింది.. అనంతరం మే 2 నుంచి తిరిగి భారతదేశానికి వచ్చింది. అలాగే, 2020లో కరోనా మహమ్మారి కారణంగా ఈ టోర్నమెంట్‌ను మరోసారి UAEకి మార్చారు.
Read Also: web series : గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న కోవై సరళ..
ఇక, 2021లో ఐపీఎల్ టోర్నమెంట్ భారతదేశంలో జరిగింది. కేవలం, ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, చెన్నై నాలుగు వేదికలలో మాత్రమే కొనసాగింది. 2022లో కూడా ప్రేక్షకులు లేకుండానే ఈవెంట్ కొనసాగింది భారత్ లో.. ముంబై, పూణే, కోల్‌కతా, అహ్మదాబాద్ నాలుగు వేదికలలో మాత్రమే జరిగింది. అయితే, కరోనా తగ్గిపోవడంతో 2023 నుంచి ఐపీఎల్ మళ్ళీ భారతదేశం మొత్తం నిర్వహిస్తున్నారు.. ఇప్పుడు పాకిస్తాన్ తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా పరమైన ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టారు.
Read Also: Operation Sindoor: భారత్ మెరుపు దాడి.. హఫీజ్ ఉగ్రవాద స్థావరం నుంచి మృతదేహాలు వెలికితీత
కాగా, ‘ఆపరేషన్ సిందూర్’లో భారత సాయుధ దళాలు సమన్వయంతో పాకిస్తాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశాయి. భారత దళాలు పాకిస్తాన్‌లోని బహవల్పూర్, మురిడ్కే, సియాల్‌కోట్‌లోని కీలక ప్రదేశాలతో సహా మరో నాలుగు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని నాశనం చేశాయి. జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాయిదీన్ స్థావరాలపై దాడులు చేసి సుమారు 80 మందికి పైగా టెర్రరిస్టులను హతం చేసింది.
