ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ విజయం సాధించింది. 35 పరుగుల తేడాతో గెలుపొందింది. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. చెన్నై బ్యాటింగ్లో డారిల్ మిచెల్ అత్యధికంగా (63) పరుగులతో రాణించాడు. ఆ తర్వాత మొయిన్ అలీ (56) రన్స్ చేశాడు. సీఎస్కే బ్యాటింగ్లో ఆరంభంలోనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత మిచెల్, మొయిన్ అలీ పరుగులు చేసి ఆదుకున్నారు. శివం దూబే (21) కూడా క్రీజులో ఉన్నంత సేపు బాగానే రాణించినప్పటికీ క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత జడేజా (18), ధోనీ (26*), శార్దుల్ ఠాకూర్ (3) పరుగులు చేశారు. గుజరాత్ బౌలింగ్లో మోహిత్ శర్మ 3 కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత.. రషీద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు. సందీప్ వారియర్, ఉమేష్ యాదవ్కు తలో వికెట్ దక్కింది.
KCR : ఈ సారి మోడీ వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు 400 అవుతాయి
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యా్చ్లో గుజరాత్ ఓపెనర్స్ చెలరేగారు. ఇద్దరూ సెంచరీలతో అదరగొట్టారు. శుభ్మాన్ గిల్ (104), సాయి సుదర్శన్ (103) సెంచరీలు చేయడంతో గుజరాత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ ముందు 232 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. గిల్, సుదర్శన్ బ్యాటింగ్ లో ఒకరికొకరు పోటాపోటీగా రన్స్ చేస్తూ వచ్చారు. గిల్ ఇన్నింగ్స్ లో 51 బంతుల్లో 7 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. సుదర్శన్ ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో గిల్కు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. కాగా.. ఈ ఇద్దరి వికెట్లు తీయడంలో చెన్నై బౌలర్లు విఫలమయ్యారు.
AP Elections 2024: సీఎస్ వివరణపై స్పందించిన సీఈసీ.. అలా అయితే మాకు అభ్యంతరం లేదు..
ఆ తర్వాత వచ్చిన గుజరాత్ బ్యాటింగ్లో డేవిడ్ మిల్లర్ (16*), షారూఖ్ ఖాన్ (2) పరుగులు చేశారు. కాగా.. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్ పాండే ఒక్కడే 2 వికెట్లు సాధించాడు. మిగతా బౌలర్లు పరుగులు తప్ప.. వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. అత్యధికంగా.. సిమర్జీత్ సింగ్ 4 ఓవర్లు బౌలింగ్ వేసి 60 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత డేరిల్ మిచెల్ నాలుగు ఓవర్లలో 52 పరుగులిచ్చాడు.
