Glenn Phillips-Reporter: అసలు అలా అడగొచ్చా.. రిపోర్టర్‌పై జీటీ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ ఫైర్!
- క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ పరాజయం
- మీడియా సమావేశంలో పాల్గొన్న జీటీ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్
- రిపోర్టర్‌పై గ్లెన్ ఫిలిప్స్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Glenn Phillips Slams Reporter after IPL 2026 Qualifier 1: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో గుజరాత్ టైటాన్స్ (జీటీ) ఘోర పరాజయం చవిచూసిన తర్వాత జట్టులో తీవ్ర నిరాశ నెలకొంది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 254 పరుగుల భారీ స్కోరు చేయగా.. ఛేదనలో జీటీ 162 పరుగులకే ఆలౌట్ అయింది. 92 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన గుజరాత్ నేరుగా ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో జీటీ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ పాల్గొన్నాడు. అయితే ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై ఫిలిప్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘ఆర్సీబీ 254 పరుగుల భారీ స్కోరు చేసిన తర్వాతే జీటీ మానసికంగా ఓటమిని అంగీకరించిందా?’ అని గ్లెన్ ఫిలిప్స్‌ను ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఓ జర్నలిస్ట్ ప్రశ్నించాడు. జర్నలిస్ట్ ప్రశ్నతో ఫిలిప్స్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే స్పందిస్తూ.. ‘అది చాలా సిల్లీ క్వశన్. నిజంగా చాలా చెత్త ప్రశ్న. ప్రొఫెషనల్ క్రికెటర్లు మైదానంలోకి ఓడిపోవడానికి వెళ్లరు. మేమెందుకు మ్యాచ్ వదిలేస్తాం?. 250 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయాలంటే ప్రతి విషయం సరిగ్గా జరగాలి. మేము చాలా ప్రయత్నించాం. కానీ అది సాధ్యపడలేదు’ అంటూ గట్టిగా బదులిచ్చాడు.
Also Read
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
గుజరాత్ టైటాన్స్ టాప్ ఆర్డర్ త్వరగా కుప్పకూలడం గురించి ఫిలిప్స్ స్పందించాడు. ‘250 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసే సమయంలో ప్రెజర్ ఉంటుంది. చాలా తక్కువ జట్లు మాత్రమే పెద్ద లక్ష్యాలను ఛేదించగలిగాయి. పంజాబ్ కింగ్స్ కొన్ని సార్లు ఛేజ్ చేసి చూపించింది. టార్గెట్ అవతలి వారికి ఈజీగా కనిపించొచ్చు కానీ.. నిజానికి అలాంటి బిగ్ టార్గెట్ ఛేజ్ చేయడం చాలా కష్టం. నేను ఇప్పటివరకు 250 పరుగులకు దగ్గరగా ఉన్న ఛేజ్‌లో కూడా భాగం కాలేదు. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మనకు అనుకూలించవు’ అని గ్లెన్ ఫిలిప్స్ చెప్పుకొచ్చాడు.
‘ఈ మ్యాచ్‌లో ఆడకపోయినా మీడియా సమావేశానికి రావడం వింతగా అనిపించలేదా?’ అని మరో రిపోర్టర్ ప్రశ్నించగా.. ఫిలిప్స్ చాలా ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. ‘అందులో వింతేమీ లేదు. మేమంతా జట్టులో భాగమే. ప్రతి ఒక్కరికీ మీడియా బాధ్యతలు ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు ఎలిమినేటర్ ఆడాల్సిన ప్లేయర్లకు కాస్త విశ్రాంతి అవసరం. వారు తదుపరి మ్యాచ్‌కు మానసికంగా సిద్ధం కావాలి. మా కోచ్ ఆశిష్ నెహ్రా ఎప్పుడూ చెప్పినట్లే.. చిల్ పిల్ తీసుకుని తదుపరి మ్యాచ్‌పై ఫోకస్ పెట్టాలి’ అని తెలిపాడు. క్వాలిఫయర్-1లో ఓడిపోయినప్పటికీ గుజరాత్ టైటాన్స్‌కు ఇంకా ఫైనల్ చేరే అవకాశం ఉంది. క్వాలిఫయర్-2లో గెలిస్తే ఫైనల్ బెర్త్ ఖాయం అవుతుంది. అయితే ఆర్సీబీ చేతిలో ఎదురైన భారీ ఓటమి నుంచి త్వరగా కోలుకుని మళ్లీ బలంగా తిరిగి రావడమే జీటీ ముందున్న అసలైన సవాల్.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!