Jake Fraser-McGurk: ఓకే ఓవర్లో 4,4,6,4,6,6.. మెక్‌గర్క్ విధ్వంసం వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jake Fraser-McGurk Fires 30 Runs in Washington Sundar Bowling: ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ జెక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. 15 బంతుల్లోనే అర్ధ శతకం చేసి.. ఐపీఎల్ 2024లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఈ యువ ఆటగాడు 18 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు. అయితే మెక్‌గర్క్ ఓకే ఓవర్లో 30 పరుగులు చేయడం విశేషం.
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు జెక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ చుక్కలు చూపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ మూడో ఓవర్‌ను సుందర్ వేయగా మెక్‌గర్క్ చెలరేగిపోయాడు. వరుసగా 4, 4, 6, 4, 6, 6 బాదాడు. 3 సిక్స్‌లు, 3 ఫోర్ల సాయంతో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. మెక్‌గర్క్ బాడుతుంటే ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లకు ఏం చేయాలో అర్ధం కాలేదు. మెక్‌గర్క్ వీర బాదుడుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఇదేం బాదుడు రా అయ్యా అని కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024.. భారత జట్టు ఎంపికకు ముహూర్తం ఖరారు!
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా జెక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ నిలిచాడు. ఎస్ఆర్హెచ్పై మెక్‌గర్క్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు క్రిస్ మోరిస్ (17) పేరిట ఉంది. ఐపీఎల్ 2024లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా మెక్‌గర్క్ మరో రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ పేరిట ఉండేది. ఈ సీజన్లో వీరిద్దరూ 16 బంతుల్లో ఫిఫ్టీ చేశారు.
It just keeps getting better 🤌#DCvSRH #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/nD5YZSb1CA
— JioCinema (@JioCinema) April 20, 2024
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్‌లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్‌లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్‌లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..