Sanju Samson React on Rajasthan Royals Defeat vs Delhi: బౌలింగ్‌లో అదనంగా 10 పరుగులు ఇవ్వడంతో పాటు ఛేదనలో వరుసగా వికెట్లు కోల్పోవడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. తాము రెండు బౌండరీలు తక్కువగా ఇచ్చి ఉంటే గెలిచేవాళ్లమని చెప్పాడు. జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్, ట్రిస్టన్ స్టబ్స్ అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు. తదుపరి మ్యాచ్ గెలిచి టోర్నీలో ముందడుగు వేసే ప్రయత్నం చేస్తాం అని సంజూ చెప్పుకోచ్చాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది.
మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ… ‘మేం గెలవాల్సిన మ్యాచ్ ఇది. ఓవర్‌కు 11-12 పరుగులే కాబట్టి.. చేధించాల్సిన లక్ష్యమే. కానీ ఐపీఎల్‌లో ఇలా జరగడం సాధారణం. పరిస్థితులకు తగ్గట్లు ఆడి.. రెండు ఇన్నింగ్స్‌ల్లో మేం రాణించాం. 220 పరుగుల లక్ష్యం అంటే.. మేం 10 రన్స్ ఎక్కువగా ఇచ్చాం. రెండు బౌండరీలు ఇవ్వాల్సింది కాదు. ఢిల్లీ ఓపెనర్ ఫ్రేజర్ మెక్‌గర్క్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మేము అతడిని ఎక్కువ రన్స్ చేయకుండా అడ్డుకున్నాం. ఐపీఎల్ 2024లో మేం మూడు మ్యాచ్‌లు ఓడాం. అయితే అవన్నీ క్లోజ్ గేమ్స్. టోర్నీలో మేము చాలా బాగా ఆడుతున్నాము’ అని అన్నాడు.
Also Read: SRH vs LSG: సన్‌రైజర్స్, లక్నో మ్యాచ్‌పై నీలి నీడలు.. ఆందోళనలో హైదరాబాద్ ఫాన్స్!
‘మేం మూమెంటమ్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉంది. ట్రిస్టన్ స్టబ్స్ అద్భుతంగా ఆడాడు. గత 10-11 గేమ్‌లలో సందీప్ శర్మ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అలాంటి బౌలర్‌పై కూడా విరుచుకుపడ్డాడు. మా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ బౌలింగ్‌లో 2-3 భారీ సిక్స్‌లు బాదాడు. బాగా బ్యాటింగ్ చేసిన స్టబ్స్‌కు క్రెడిట్ ఇవ్వాలి. ఈ మ్యాచులో మేం ఓడిపోయాం. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవాలి. తదుపరి మ్యాచ్ గెలిచి ముందడుగు వేస్తాం’ అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచులో సంజూ (86; 46 బంతుల్లో 8×4, 6×6) అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.