NTV Telugu Site icon

Asia Cup 2023: పాకిస్తాన్‌కు షాక్.. అలాంటి ప్రతిపాదన ఏం లేదన్న బీసీసీఐ..

Asia Cup 2023

Asia Cup 2023

Asia Cup 2023: పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) ఆసియాకప్ 2023పై భారీ ఆశులు పెట్టుకుంది. ఈ ఏడాది జరగబోతున్న ఆసియా కప్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం పీసీబీ ఉన్న పరిస్థితుల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై భారీ ఆశలు పెట్టుకుంది. అయితే ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, ఉగ్రవాదం ఇలా పాకిస్తాన్ ను వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత జట్టు పాకిస్తాన్ లో ఆడేందుకు ససేమిరా అంటోంది. అయితే పాకిస్తాన్ లో జరిగే ఆసియా కప్ ను బహిష్కరిస్తే ఇండియాలో జరిగే వాటిని కూడా బహిష్కరిస్తామంటూ గతంలో పాక్ మాజీ ఆటగాళ్లు ప్రగల్భాలు పలికారు.

Read Also: Sanjay Raut: బీజేపీ మొసలి, కొండ చిలువ.. వారితో వెళ్తే అంతే సంగతులు..

ఇదిలా ఉంటే భారత్ తో జరిగే మ్యాచులను హైబ్రీడ్ మోడల్ లో నిర్వహిస్తామని పీసీబీ ప్రతిపాదించినట్లు అందుకు భారత్ కూడా అంగీకరించినట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. హైబ్రీడ్ మోడల్ అంటే భారత్ తో జరిగే మ్యాచులను తటస్థ వేదికలు అయిన యూఏఈ, యూకే, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో నిర్వహిస్తామంటూ పీసీబీ ప్రతిపాదించింది. దీనికి భారత్ అంగీకరించిందని పాకిస్తాన్ మీడియా కోడై కూసింది.

అయితే తాజాగా బీసీసీఐ ప్రకటనతో పాకిస్తాన్ కు షాక్ తగిలింది. పీసీబీ హైబ్రీడ్ మోడల్ కు బీసీసీఐ అంగీకరించదనే వాదనలను తోసి పుచ్చింది. అలాంటిదేం లేదని ప్రకటించింది. ఆసియా కప్ 2023 కోసం హైబ్రిడ్ మోడల్‌ను బోర్డు ఆమోదించలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్ ఫైనల్ చూడటానికి శ్రీలంక క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారును ఆహ్వానించినట్లు బీసీసీఐ తెలిపింది. ఆదివారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫైనల్ జరగనుంది. ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఆసియా కప్ పై నిర్ణయం తీసుకోనున్నట్లు బీసీసీఐ ఇటీవల తెలిపింది.

Show comments