Arshdeep Singh History: ఐపీఎల్లో అర్ష్‌దీప్ సింగ్ ‘సెంచరీ’.. ఏకైక బౌలర్‌గా అరుదైన రికార్డు!
- ఐపీఎల్లో అర్ష్‌దీప్ సింగ్ సెంచరీ
- ఏకైక పంజాబ్ బౌలర్‌గా అరుదైన రికార్డు
- పంజాబ్ జట్టుకు ప్రధాన బలంగా నిలుస్తున్న అర్ష్‌దీప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arshdeep Singh IPL 100 Wickets: పంజాబ్ కింగ్స్ యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వంద వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు. ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ వికెట్ తీయడంతో ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. దీంతో భారత టీ20 లీగ్ చరిత్రలో 100 వికెట్లు తీసిన 31వ బౌలర్‌గా అర్ష్‌దీప్ నిలిచాడు. ఐపీఎల్లో వంద వికెట్లు సాధించిన ఐదో లెఫ్టార్మ్ పేసర్, నాలుగో భారత బౌలర్‌గా కూడా నిలిచాడు.
అర్ష్‌దీప్ సింగ్ తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 87 మ్యాచ్‌లు ఆడగా.. అన్నీ పంజాబ్ కింగ్స్ (గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్) తరఫునే ఆడాడు. పంజాబ్ టీమ్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా అర్ష్‌దీప్ రికార్డు సృష్టించాడు. తన స్వింగ్, యార్కర్లతో కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ పంజాబ్ జట్టుకు ప్రధాన బలంగా నిలుస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో కూడా అర్ష్‌దీప్ అద్భుతంగా రాణిస్తున్నాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్ తరఫున 84 మ్యాచ్‌లలో 127 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో కూడా కీలక సభ్యుడిగా ఉన్నాడు.
Also Read
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
- Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లే..
Also Read: Hardik Pandya: ఏం మాట్లాడాలో తెలియడం లేదు.. ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థం కావడం లేదు!
ఐపీఎల్లో ఒకే జట్టు తరఫున 100కి పైగా వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అర్ష్‌దీప్ సింగ్ చోటు సంపాదించాడు. ఈ జాబితాలో సునీల్ నరైన్ (195 – కేకేఆర్), జస్ప్రీత్ బుమ్రా (183 – ఎంఐ), లసిత్ మలింగ (170 – ఎంఐ), భువనేశ్వర్ కుమార్ (157 – ఎస్ఆర్హెచ్), రవీంద్ర జడేజా (143 – సీఎస్కే), డ్వేన్ బ్రావో (140 – సీఎస్కే), యుజ్వేంద్ర చహల్ (139 – ఆర్సీబీ), హర్భజన్ సింగ్ (127 – ఎంఐ) వంటి దిగ్గజాల సరసన అర్ష్‌దీప్ (101 – పీబీకేఎస్) నిలిచాడు.
తాజావార్తలు
-
Nagpur: ఐఏఎఫ్ అధికారి భార్యపై అత్యాచారం, మతం మార్చుకోవాలని ఒత్తిడి.. సంచలనంగా నాగ్‌పూర్ వైరల్ వీడియో..
-
Bloody Romeo: న్యాచురల్ స్టార్ నెక్స్ట్ లెవెల్ మేకోవర్.. లండన్‌లో ‘బ్లడీ రోమియో’ లొకేషన్ వేట మొదలుపెట్టిన సుజీత్!
-
Uttar Pradesh: ఓవైసీతో పొత్తుకు కాంగ్రెస్ రెడీ..? యూపీలో కొత్త కూటమి..
-
Kerala: నిపా నుంచి షిగెల్లా వరకు..కొత్త వ్యాధుల అడ్డాగా కేరళ ఎందుకు నిలుస్తోంది?
-
Actor Vishal : బొకేలు, శాలువాలు పక్కనబెట్టి కాలేజీ స్నేహితుల కలయిక
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?