Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు బుల్లితెరపై అనతికాలంలోనే టాప్ యాంకర్‌గా ఎదిగిన ఉదయభాను, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారు. అయితే ఆమె బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ, కొన్ని సినిమాల్లో మాత్రమే నటించి, ఆ తర్వాత సినిమాలకు ఎందుకు దూరమయ్యారు? ఈ ప్రశ్నకు ఉదయభాను ‘ఎన్టీవీ పాడ్‌కాస్ట్’ (The Podcast Show with NTV) వేదికగా ఆసక్తికరమైన, సంచలన నిజాలు వెల్లడించారు. సినిమాలకు ఎందుకు దూరమయ్యారన్న ప్రశ్నకు ఉదయభాను సూటిగా బదులిచ్చారు. “సినిమా ఇండస్ట్రీలోని కొన్ని విషయాలు అందరికీ వర్కవుట్ కావు, నాకైతే అస్సలు కాలేదు. షూటింగ్లలో కొందరి చూపులు, వాళ్ల ప్రవర్తన, మాట్లాడే తీరు నాకు ఏమాత్రం నచ్చేవి కావు. ఇండస్ట్రీలో చాలా మంది చెడ్డవాళ్లు ఉంటారు. వాళ్లందరినీ తప్పించుకుంటూ, వాళ్ల ముందు జాగ్రత్తగా ఉంటూ నటించడం నావల్ల కాలేదు. ఈ టార్చర్ భరించలేకే సినిమాలు మానేశాను” అని ఉదయభాను తన మనసులోని మాటలను నిర్మొహమాటంగా పంచుకున్నారు.
సినిమాల్లోని ఈ వాతావరణం భరించలేకనే తాను బుల్లితెర వైపు అడుగులేశానని ఆమె స్పష్టం చేశారు. “టీవీలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఒక ఎపిసోడ్‌కు అప్పట్లో 500, 800 లేదా మహా అయితే వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్లు. పారితోషికం తక్కువే అయినా, టీవీ ఇండస్ట్రీ నాకు ఒక డిగ్నిఫైడ్ లైఫ్‌ను ఇచ్చింది. అందుకే నేను సినిమాలను పక్కనపెట్టి టీవీని ఎంచుకున్నాను” అని ఉదయభాను తన నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాన్ని వివరించారు. వెండితెరపై అవకాశాలు వస్తున్నా.. అక్కడి చేదు అనుభవాల వల్లే బుల్లితెరలో స్టార్‌గా ఎదిగినట్లు ఆమె చెప్పిన నిజాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!