Apple iPhone 18 Pro Sale: iPhone 18 Pro కొనుగోలు కోసం రాత్రి నుంచే భారీ క్యూ.. Apple స్టోర్ వద్ద కస్టమర్ల సందడి
- కొత్త iPhone 18 Pro కొనాలంటే ఇంత క్రేజ్నా?
- రాత్రి నుంచే Apple స్టోర్ వద్ద కస్టమర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple iPhone 18 Pro Series Sale: Apple కొత్తగా విడుదల చేసిన iPhone 18 Pro సిరీస్‌పై ఆపిల్ లవర్స్ లో భారీ ఆసక్తి నెలకొంది. అమ్మకాలు ప్రారంభం కాకముందే ఢిల్లీలోని సాకేత్‌లో ఉన్న Apple స్టోర్ బయట పెద్ద సంఖ్యలో కస్టమర్లు బారులు తీరారు. ఉదయం 8 గంటలకు అమ్మకాలు ప్రారంభం కానుండగా, కొందరు రాత్రి నుంచే స్టోర్‌కు చేరుకున్నారు. కొత్త iPhone 18 Pro, iPhone 18 Pro Max ఫోన్లను తొలుత కొనుగోలు చేయాలనే ఉత్సాహంతో టెక్ రివ్యూయర్లు, కంటెంట్ క్రియేటర్లు, Apple పాత కస్టమర్లు క్యూ కట్టారు.
ఉదయం నుంచే స్టోర్ వద్ద కస్టమర్ల సందడి
ఢిల్లీలోని Select Citywalk Mallలో ఉన్న Apple స్టోర్ వెలుపల ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. iPhone 18 Pro, iPhone 18 Pro Max అమ్మకాలు ప్రారంభం కావడానికి ముందే పొడవాటి క్యూలు ఏర్పడ్డాయి. Apple కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లపై యువత, టెక్నాలజీ ప్రియుల్లో ప్రత్యేక ఆసక్తి కనిపించింది. చాలామంది కస్టమర్లు ఇప్పటికే ప్రీ-బుకింగ్ చేసుకున్నారు. ఇప్పుడు తమ కొత్త డివైస్‌ను అందుకోవడానికి స్టోర్ వద్ద ఎదురుచూస్తున్నారు.
Also Read
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
టెక్ రివ్యూయర్లలోనూ కనిపించిన ఉత్సాహం
వార్తా సంస్థ ANI ప్రకారం, క్యూలో నిల్చున్న సూరజ్ చౌహాన్ అనే కస్టమర్ తనకు యూట్యూబ్ ఛానల్ ఉందని, టెక్నాలజీకి సంబంధించిన రివ్యూలు చేస్తుంటానని తెలిపారు. గతేడాది తాను iPhone 17 Pro కొనుగోలు చేశానని, ఈసారి iPhone 18 Pro Max కోసం వచ్చానని చెప్పారు. కొత్త మోడల్లో కెమెరా, క్వాలిటీ పరంగా ఇంప్రూవ్ మెంట్స్ ఉంటాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
1TB వేరియంట్‌పై ప్రత్యేక ఆసక్తి
మరో కస్టమర్ అజయ్ మాట్లాడుతూ, iPhone 18 Pro Max 1TB వేరియంట్‌ను ఇప్పటికే ప్రీ-బుక్ చేసుకున్నట్లు తెలిపారు. కొత్త ఫోన్‌ను అందరికంటే ముందుగా పొందాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాను iPhone 17 Pro ఉపయోగిస్తున్నానని, కొత్త మోడల్లోని ఫీచర్లను అనుభవించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.
Apple స్టోర్ వద్ద పండుగ వాతావరణం
అమ్మకాలు ప్రారంభం కాకముందే Apple స్టోర్ వెలుపల పండుగ వాతావరణం కనిపించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు స్టోర్ తెరుచుకునే సమయం కోసం వేచి ఉన్నారు. కొత్త ఫోన్ కొనుగోలు చేయడంతో పాటు, దాన్ని తొలిసారిగా చూసి ఉపయోగించే అనుభూతి కోసం కూడా పలువురు కస్టమర్లు స్టోర్‌కు చేరుకున్నారు.
బెంగళూరులో భారీ సంఖ్యలో కస్టమర్లు స్టోర్ల వద్దకు చేరుకున్నారు. మాల్ ఆఫ్ ఏషియాలోని Imagine Apple ప్రీమియం రీసెల్లర్ స్టోర్ వెలుపల కొత్త ఐఫోన్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు పొడవాటి క్యూలలో నిల్చున్నారు. తాజా డివైస్‌లను సొంతం చేసుకోవాలనే ఉత్సాహంతో టెక్నాలజీ ప్రియులు, Apple అభిమానులు పెద్ద సంఖ్యలో స్టోర్‌కు తరలివచ్చారు.
#WATCH | Bengaluru: Massive crowds gather as the official sale of the iPhone 18 Pro and iPhone 18 Pro Max begins today in India.
Eager customers have lined up in long queues outside the Imagine Apple premium reseller store at the Mall of Asia to get their hands on the latest… pic.twitter.com/WlslzgvIFh
— ANI (@ANI) September 18, 2026
తాజావార్తలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి