The Paradise: ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ ఉంది. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌ను కూడా మేకర్స్ వేగవంతం చేశారు. అయితే ఈ ప్రచార కార్యక్రమాల్లో హీరోయిన్ కయాదు లోహర్ ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు చర్చగా మారింది. అసలు కాయదు ప్రమోషన్లకు ఎందుకు రావడం లేదు? ఆమెకు, చిత్రబృందానికి మధ్య ఏమైనా సమస్యలు ఉన్నాయా? తాజాగా చెన్నై ప్రెస్ మీట్లో నాని ఇచ్చిన సమాధానంతో ఈ ప్రశ్నలకు ఓ క్లారిటీ వచ్చింది. ది ప్యారడైజ్ ప్రమోషన్లలో కాయదు లోహర్ ఎందుకు కనిపించడం లేదని ఓ రిపోర్టర్ నానిని ప్రశ్నించారు. ఆమె బిజీ షెడ్యూల్ కారణంగానే కార్యక్రమాలకు హాజరు కావడం లేదేమో అని అడిగారు. దీనికి నాని తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. ఈ ప్రశ్నకు తన దగ్గర ఒక అద్భుతమైన సమాధానం ఉందంటూ ఆసక్తికరంగా మాట్లాడారు.
కయాదు ప్రస్తుతం కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారని నాని తెలిపారు. మారి సెల్వరాజ్ ఓ మంచి సినిమా చేస్తున్నారని, అందులో కాయదు నటిస్తున్నారని చెప్పారు. అయితే ఆ సినిమా షూటింగ్ నుంచి ఆమెను ఈ ప్రెస్ మీట్‌కు రావడానికి మారి సెల్వరాజ్ ఒప్పుకోలేదని నాని సరదాగా వ్యాఖ్యానించారు. అందుకే కాయదు చెన్నై ప్రెస్ మీట్‌కు హాజరు కాలేకపోయిందని వివరించారు. హీరోయిన్ ప్రమోషన్లకు రాకపోవడంతో సాధారణంగా రకరకాల ఊహాగానాలు మొదలవుతుంటాయి. సినిమా టీమ్‌తో విభేదాలు ఉన్నాయా, డేట్స్ సమస్య వచ్చిందా, మరేదైనా కారణమా అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అయితే కాయదు విషయంలో అలాంటి ఊహాగానాలకు తావు లేకుండా నాని స్వయంగా కారణాన్ని వెల్లడించారు. అంతేకాదు మరో దర్శకుడి ప్రాజెక్ట్ గురించి కూడా పాజిటివ్‌గా మాట్లాడటం ఆసక్తిని పెంచింది.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
కయాదు లోహర్ ‘ది ప్యారడైజ్’లో నానికి జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఇక సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లో ది ప్యారడైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఇప్పటివరకు ప్రమోషన్లకు దూరంగా ఉన్న కయాదు ఈ గ్రాండ్ ఈవెంట్‌కు వస్తారా లేదా అనే విషయం మీద కూడా చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొంటే సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను పంచుకునే అవకాశం ఉంది.
మరోవైపు ‘ది ప్యారడైజ్’ను సెప్టెంబర్ 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ సినిమాకు ఇప్పటివరకు ట్రైలర్ విడుదల చేయలేదు. టీజర్, పాటలతోనే సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ మేకర్స్ ముందుకెళ్తున్నారు. అలాగే ఈ సినిమాకు ‘A’ సర్టిఫికెట్ వచ్చే అవకాశం ఉండటంతో మరో వర్గం ప్రేక్షకులు ఈ మూవీకి దూరం అయ్యే అవకాశం ఉందని నాని ఈ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. ఇక ట్రైలర్ లేకుండా, ‘A’ సర్టిఫికెట్ తో థియేటర్లలోకి వస్తున్న ‘ది ప్యారడైజ్’ కు ప్రేక్షకులకు నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
- Tags
- cinema
- The Paradise
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!