Abhishek Sharma: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ.. కీలక మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు!
- ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ
- కీలక మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు
- పరిస్థితులకు తగ్గట్టు ఆడటం నేర్చుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma’s poor record in knockout matches: భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రతిభపై ఎలాంటి సందేహం లేదు. పవర్‌ప్లేలో దూకుడైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలిచే సామర్థ్యం అతడికి ఉంది. ముఖ్యంగా ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఎన్నో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడుతూ అభిమానులను అలరించాడు. అయితే కీలక మ్యాచ్‌లు, నాకౌట్ పోరుల్లో మాత్రం అభిషేక్ వరుసగా విఫలమవుతున్నాడు. దాంతో బిగ్ మ్యాచ్‌ల్లో ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాడా? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
అంతర్జాతీయ క్రికెట్లో కూడా అభిషేక్ శర్మ నాకౌట్ మ్యాచ్‌లలో పరుగులు చేయలేదు. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై కేవలం 6 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేశాడు. 2026 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై 4 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. వెస్టిండీస్‌తో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో 11 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 7 బంతుల్లో 9 పరుగులకే పరిమితమయ్యాడు. కీలక సమయంలో జట్టుకు మంచి ఆరంభం ఇవ్వాల్సిన అభిషేక్.. తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడం అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
కాటేరమ్మ కొడుకుగా పేరొందిన అభిషేక్ పరిస్థితి ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లోనూ అంతే. గత నాలుగు కీలక మ్యాచ్‌ల్లో అతడి స్కోర్లు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఓ ప్లేఆఫ్ మ్యాచ్‌లో 4 బంతుల్లో 3 పరుగులు, మరో మ్యాచ్‌లో 5 బంతుల్లో 12 పరుగులు చేశాడు. ఐపీఎల్ ఫైనల్లో 5 బంతుల్లో కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో 2 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. లీగ్ మ్యాచ్‌ల్లో బౌలర్లపై విరుచుకుపడే అభిషేక్.. నాకౌట్ దశకు వచ్చేసరికి పూర్తిగా తడబడుతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అభిషేక్ శర్మ ఆటతీరు దూకుడైనది కావడంతో కొన్నిసార్లు త్వరగా ఔటవడం సహజమే. కానీ వరుసగా కీలక మ్యాచ్‌ల్లో విఫలమవడం మాత్రం ఆందోళన కలిగించే అంశంగా మారింది. నాకౌట్ మ్యాచ్‌లలో ఇన్నింగ్స్‌ను నిర్మించడంలో అతడు మరింత మెచ్యూరిటీ చూపించాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. పవర్ హిట్టింగ్తో పాటు పరిస్థితులకు తగ్గట్టు ఆడటం కూడా నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్ 2026లో అభిషేక్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 15 ఇన్నింగ్స్‌లలో 206.23 స్ట్రైక్ రేట్, 43.31 సగటుతో 653 పరుగులు చేశాడు. ఈ సీజన్లో 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యుత్తమ స్కోరు 135 నాటౌట్.
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!