Abhishek Sharma: నాకు టార్గెట్ అంటూ ఏమీ ఉండదు, అదొక్కటే తెలుసు.. అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- అద్భుత ఫామ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ
- బ్యాటింగ్ శైలిపై అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ముందే టార్గెట్‌లు సెట్ చేసుకోను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma Batting Strategy: ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ శైలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారీ స్కోర్లు నమోదవుతున్న ఈ సీజన్‌లో ప్రతి టీమ్ మొదటి ఇన్నింగ్స్‌లోనే భారీ టార్గెట్‌ను ఉంచాలని చూస్తోందని, అలాంటి పరిస్థితుల్లో ఓపెనర్ల బాధ్యత మరింత పెరిగిందని తెలిపాడు. ఏ పరిస్థితిలో అయినా సరే జట్టు కోసం ముందుకు రావాల్సిందేనని స్పష్టం చేశాడు. తాను ముందే టార్గెట్‌లు సెట్ చేసుకోనని, బంతిని చూసి బాదడమే అని చెప్పాడు. ఒత్తిడి వచ్చినప్పుడు పార్ట్‌నర్‌తో మాట్లాడి కాన్ఫిడెన్స్ పెంచుకుని మళ్లీ దాడి చేస్తా అని అభిషేక్ చెప్పుకొచ్చాడు. బుధవారం వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 45 రన్స్ చేశాడు. ట్రావిస్ హెడ్ (76) కూడా బాదడంతో సన్‌రైజర్స్ 244 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడుతూ… ‘ఐపీఎల్ 2026లో ప్రతి జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో జట్టు కోసం ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాల్సిందే. పరిస్థితి ఏదైనా, టార్గెట్ ఎంతైనా పట్టించుకోకుండా ఆడాలి. ఓపెనర్‌గా పవర్‌ప్లేలో ఆడే విధానమే మ్యాచ్‌ను ప్రభావితం చేస్తుంది. అందుకే నేను, ట్రావిస్ హెడ్ కలిసి మొదటి నుంచే దూకుడుగా ఆడాలని ప్రయత్నిస్తాం. నేను ఎప్పుడూ ట్రావిస్ హెడ్ నుంచి ఏదో నేర్చుకోవాలని చూస్తాను. కానీ అతను ఎక్కువగా మాట్లాడడు, ఎక్కువగా తన బ్యాట్‌తోనే సమాధానం ఇస్తాడు. అయినప్పటికీ నేను ఏదైనా అడిగితే ఒకటే చెబుతాడు. బంతి నీ జోన్‌లోకి వస్తే ఎలాంటి సందేహం లేకుండా హిట్ చేయి అంటాడు. ఇదే ఫిలాసఫీని మేము గత కొన్ని సంవత్సరాలుగా అనుసరిస్తున్నాం. బంతిని బలంగా కొట్టడం. ఒత్తిడి ఉన్నప్పుడు పార్ట్‌నర్‌తో మాట్లాడి కాన్ఫిడెన్స్ పెంచుకుని మళ్లీ దాడి చేయడమే నాకు తెలుసు’ అని చెప్పాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
‘నిజం చెప్పాలంటే నేను ప్రత్యేకంగా టార్గెట్ సెట్ చేసుకోను. మా జట్టులో మిగతా వాళ్లు కూడా అంతే. పార్ట్‌నర్‌షిప్‌లో హాఫ్ సెంచరీలు, సెంచరీలు వచ్చినప్పుడు ఒకరినొకరం అభినందించుకుంటాం. స్కోర్ బోర్డ్‌లో కనిపించేదే మాకు తెలుస్తుంది. మేము బంతిని గమనించి దానికి అనుగుణంగా స్పందిస్తాం. మా విజయాల్లో బౌలర్లకు పెద్ద క్రెడిట్ ఇవ్వాలి. వారు ఇటీవల మ్యాచ్‌ల్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. అదే మా విజయాలకు ప్రధాన కారణం. బ్యాటింగ్ యూనిట్‌గా మేము మంచి ఆరంభం ఇవ్వడానికి లేదా ఛేజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ బౌలింగ్ చాలా కష్టమైన పని. వాళ్లపై చాలా బాధ్యత ఉంటుంది. అయినప్పటికీ మలింగ, పాట్ కమిన్స్, ఇతర బౌలర్లు చాలా సింపుల్‌గా ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా కమిన్స్ బౌలర్లతో మాట్లాడే విధానం చాలా ప్రభావవంతంగా ఉంది. అందుకే బౌలింగ్ యూనిట్‌గా వారు చాలా మెరుగయ్యారు’ అని అభిషేక్ తెలిపాడు.
తాజావార్తలు
-
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
-
Irumudi: అసలు ఇరుముడి అంటే ఏంటి?
-
Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
-
AI in Cinema: సినీ రంగంపై ఏఐ ఎఫెక్ట్.. సెట్లో 20% మనుషులు, 80% AI.. జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి?
-
Ashwin: “కోహ్లీ కంటే బుమ్రానే బెటర్”.. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!