IPL 2027-KKR: కొత్త కెప్టెన్‌గా విండీస్ స్టార్.. కేకేఆర్‌కు మూడు లాభాలు.. మినీ వేలంలో టార్గెట్ చేయాల్సిందే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KKR Eye on Shai Hope for IPL 2027: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జట్టు కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఇటీవల రెండు సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన మాజీ ఛాంపియన్ కేకేఆర్.. వచ్చే సీజన్లో బలమైన జట్టును నిర్మించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో వెస్టిండీస్ కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ షాయ్ హోప్‌ను దక్కించుకోవాలని చూస్తోందని తెలుస్తోంది. అతడిని మినీ వేలంలో దక్కించుకుంటే.. జట్టుకు నాయకత్వంతో పాటు బ్యాటింగ్‌లోనూ బలం చేకూరుతుందని భావిస్తోందట.
కేకేఆర్‌కు కొత్త కెప్టెన్:
అజింక్య రహానే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో కేకేఆర్ కొత్త కెప్టెన్ కోసం అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జట్టును ముందుండి నడిపించగల అనుభవజ్ఞుడైన ఆటగాడు ఆ ఫ్రాంచైజీకి అవసరం. ఈ నేపథ్యంలో షాయ్ హోప్ సరైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ జట్టుకు వన్డేలు, టీ20ల్లో నాయకత్వం వహిస్తున్న హోప్‌కు కెప్టెన్సీలో మంచి అనుభవం ఉంది. ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోవడం, జట్టులోని ఆటగాళ్లను సమన్వయం చేసుకోవడం వంటి అంశాల్లో అతడి అనుభవం కేకేఆర్‌కు ఉపయోగపడొచ్చు. ప్రశాంతంగా వ్యవహరిస్తూనే తన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలవగల సామర్థ్యం కూడా అతడికి ఉంది. ఐపీఎల్లో విదేశీ ఆటగాళ్లు కెప్టెన్లుగా వ్యవహరించడం కొత్తేమీ కాదు. అందువల్ల హోప్ కూడా కేకేఆర్ నాయకత్వ రేసులో ఉన్నాడు.
Also Read
- Pat Cummins: "నాకు అస్సలు తెలియదు".. బాల్ ట్యాంపరింగ్ అంశంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్
- Kavya Maran-Anirudh Wedding: పురోహితులు లేకుండానే పెళ్లి.. 'స్వాభిమానం' మ్యారేజ్ అంటే?.. అనిరుధ్, కావ్య వివాహ వేడుకలో ఆసక్తికర విశేషాలు!
- Ishan Kishan: టీమిండియాలోకి రావడం చాలా సంతోషంగా ఉంది.. నా టార్గెట్ అదే!
- IPL 2027-KKR: కేకేఆర్‌లో భారీ మార్పులు.. రిటైన్, రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే!
2026లో టీ20ల్లో అదరగొట్టిన హోప్:
షాయ్ హోప్ ఇటీవలి టీ20 ఫామ్ అద్భుతంగా ఉంది. కేకేఆర్ ఆసక్తి చూపడానికి ఇదే ప్రధాన కారణం. 2026లో టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 16 ఇన్నింగ్స్‌ల్లో 601 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 50.08 సగటు, 152.5 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. భారత్‌తో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లోనూ హోప్ అద్భుతంగా రాణించాడు. రాంచీలో జరిగిన మ్యాచ్‌లో 45 బంతుల్లో 102 పరుగులు చేసిన అతడు.. నాలుగో టీ20లో 50 బంతుల్లో మరో 102 పరుగులు సాధించాడు. ఈ ప్రదర్శనలతో టీ20ల్లో మూడు సెంచరీలు చేసిన తొలి వెస్టిండీస్ బ్యాటర్‌గా నిలిచాడు.
టాప్ ఆర్డర్ బ్యాటర్.. వికెట్ కీపర్ కూడా:
షాయ్ హోప్‌ను కేకేఆర్ లక్ష్యంగా చేసుకోవడానికి మరో ముఖ్యమైన కారణం అతడి బహుముఖ ప్రజ్ఞ. టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా ఇన్నింగ్స్‌ను ప్రారంభించగలడు. అవసరమైతే మూడో స్థానంలోనూ బ్యాటింగ్ చేయగలడు. మొదట ఇన్నింగ్స్‌ను నిలకడగా నిర్మించి.. క్రీజులో కుదురుకున్న తర్వాత వేగంగా పరుగులు సాధించడం అతడి ప్రత్యేకత. దీనికి తోడు వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తించగలడు. దీంతో తుది జట్టు ఎంపికలో కేకేఆర్‌కు మరో ప్రత్యామ్నాయం లభిస్తుంది. విదేశీ ఆటగాళ్ల కూర్పు, జట్టు సమతూకాన్ని నిర్వహించడంలోనూ అతడి సేవలు ఉపయోగపడే అవకాశం ఉంది.
మూడు లాభాలు:
హోప్ ఇప్పటికే 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్లో ఆడాడు. ఆ సీజన్లో తొమ్మిది మ్యాచ్‌ల్లో 183 పరుగులు చేశాడు. 150 స్ట్రైక్‌రేట్ నమోదు చేసినప్పటికీ.. అతడి ప్రదర్శన అప్పట్లో పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ప్రస్తుతం టీ20 క్రికెట్లో చూపిస్తున్న ఫామ్ చూస్తే గతంతో పోలిస్తే మరింత ప్రమాదకరమైన బ్యాటర్‌గా మారాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా కెప్టెన్సీ అనుభవం, టాప్ ఆర్డర్ బ్యాటింగ్, వికెట్ కీపింగ్ నైపుణ్యం.. ఈ మూడు అంశాలు హోప్‌ను కేకేఆర్‌కు ఉపయోగపడే ఆటగాడిగా నిలబెడుతున్నాయి. ఐపీఎల్ 2027 మినీ వేలంలో అతడి పేరు నమోదైతే కేకేఆర్ అతడి కోసం గట్టిగా ప్రయత్నిస్తుంది.
తాజావార్తలు
-
IPL 2027-KKR: కొత్త కెప్టెన్‌గా విండీస్ స్టార్.. కేకేఆర్‌కు మూడు లాభాలు.. మినీ వేలంలో టార్గెట్ చేయాల్సిందే?
-
Samsung Galaxy Sliding Phone: ఫోల్డబుల్ కాదు.. స్లైడింగ్ డిస్ప్లేతో సామ్ సంగ్ కొత్త ఫోన్! డిజైన్ లీక్
-
Pat Cummins: “నాకు అస్సలు తెలియదు”.. బాల్ ట్యాంపరింగ్ అంశంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్
-
CII Partnership Summit Day 2: సీఐఐ సదస్సులో రెండో రోజు కీలక పరిణామాలు.. చంద్రబాబు ఫుల్ బిజీ..!
-
Jensen Huang Third Girlfriend: జెన్సన్ హువాంగ్ మూడో గర్ల్‌ఫ్రెండ్ ఎవరు?.. ఎన్విడియా సీఈఓపై మరో సంచలన ఆరోపణలు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!