Aiden Markram: మాకు భయం లేదు.. మా టీమ్ స్ట్రాంగ్ గా ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2023లో ఇవాళ జరిగే మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది. దూకుడైన ఆటతో ముందుకు వెళ్తున్న కేకేఆర్ టీమ్ పటిష్టంగా ఉంది. అయితే దానికి కళ్లెం వేసేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లాన్ వేసింది. ఇప్పటికే శార్థూల్ ఠాకూర్, రింకూ సింగ్ కేకేఆర్ కు పూర్తిగా న్యాయం చేస్తున్నారు. కీలక సమయాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే కేకేఆర్ రూపంలో మాకు భారీ ముప్పు ఎదురుకాబోతుందని ఎస్ ఆర్ హెచ్ కెప్టెన్ మార్ర్కమ్ అన్నాడు. అయితే మా ప్రణాళికలు మాకు పక్కగా ఉన్నాయి.. వాటిని చక్కగ అమలు చేస్తే అనుకున్న ఫలితాలు వస్తాయని అన్నాడు. అయితే మా బౌలిర్లపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తారు.. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగలరు అని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్ర్కమ్ అన్నాడు.
Read Also : Husband kills wife: హైదరాబాద్ లో దారుణం.. రోడ్డుపై వెంటాడి భార్యను హత్య చేసిన భర్త
Also Read
- World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
- Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91, రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్లాప్!
- Afg Vs Nepal: ఏంది సామీ ఆ ఆట.. ఆఫ్ఘనిస్థాన్‌ను చుట్టేసిన నేపాల్ జట్టు.. కుమ్మేసిన పసికూన..
- IND vs WI: రుతురాజ్, నితీష్ ఇన్.. ఆ ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
కాగా ఐపీఎల్ 2023లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యా్చ్ లలో మూడింట ఒకటి మాత్రమే ఎస్ ఆర్ హెచ్ గెలిచింది. సొంత స్టేడియంలో రాజస్థా్న్ రాయల్స్ తో తమ ఆరంభ మ్యాచ్ లో రెగ్యూలర్ కెప్టెన్ మార్క్రమ్ దూరం కాగా.. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. ఈ మ్యాచ్ లో భారీ తేడాతో పరాజయం పాలైంది. పదహారో ఎడిసన్ ను ఆరంభించింది. ఇక రెండో మ్యాచ్ కు మార్క్రమ్ అందుబాటులోకి వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడింది. తర్వాత ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఎట్టకేలకు తొలి విజయాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసింది.
Read Also : Selfie Challenge: చంద్రబాబుకు డిప్యూటీ సీఎం సెల్ఫీ ఛాలెంజ్
ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ నాలుగో మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో మీడియాలో మాట్లాడిన కెప్టెన్ మార్ర్కమ్.. తమ బౌలర్లపై నమ్మకం ఉందంటూ ధీమా వ్యక్తం చేశాడు. కేకేఆర్ కు గత రెండు మ్యాచ్ లలో విజయాలు అందించిన శార్థూల్ ఠాకూర్, రింకూ సింగ్ లను చూసి తామేమీ భయపడటం లేదని.. వాళ్లను కట్టడి చేసే వ్యూహాలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొన్నాడు. అయితే ఇప్పటి వరకు కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లలో సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 8 మ్యాచ్ ల్లో మాత్రమే గెలిచింది. మిగిలిన 15 సార్లు ఓడిపోయింది. ఇక ఈడెన్ గార్డెన్స్ లో సైతం కోల్ కతాదే ప చేయి. సొంత మైదానంలో ఎస్ ఆర్ హెచ్ తో ఆడిన ఎనిమిది మ్యాచ్ లలో కేకేఆర్ ఆరింట గెలిచింది. ఇక 2020 తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ఇక్కడ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది.
Read Also : Uber: మొబైల్స్ బ్యాటరీ తక్కువ ఉంటే ఎక్కువ ఛార్జీలు వసూలు.. ఆరోపణల్ని ఖండించిన ఊబెర్..
సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి ఇంత వరకు ఒక్కసారి కూడా సునీల్ నరైన్ బౌలింగ్ లో ఔట్ కాలేదు.. సునీల్ నరైన్ బౌలింగ్ లో త్రిపాఠి 150కి పైగా స్ట్రైక్ రేటుతో ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. ఇక మార్ర్కమ్ కేకేఆర్ తో చివరి మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో 20 బంతుల్లో 40 పరుగుుల చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ పేస్ దళానికి నాయకుడు టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. అతడితో పాటు ప్రొటిస్ ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ ఉన్నారు. ఇక స్పిన్ విభాగంలో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, గత మ్యాచ్ హీరో మయాంక్ మార్కండే మరోసారి రాణించాలని సన్ రైజర్స్ హైదరాబాద్ కోరుకుంటుంది. తుది జట్టులో బౌలింగ్ విభాగంలో మార్కండే, జాన్సెన్, భువీ, ఉమ్రాన్ మాలిక్ కు కచ్చితంగా చోటు దక్కుంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే బ్యాటింగ్ విభాగంలో టాపార్డర్ రాణిస్తేనే కోల్ కతాను ఓడించడం సన్ రైజర్స్ హైదరాబాద్ కు సాధ్యమవుతుంది.

తాజావార్తలు
-
Minister Seethakka : సీతక్క కీలక ప్రకటన.. అక్టోబర్ 25 నుంచి తెలంగాణలో ‘హ్యామ్’ రోడ్లు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!