Hardik Pandya: ‘చివరికి, ఆమె నాది’.. మహికా శర్మకు రింగ్ తొడిగిన హార్దిక్ పాండ్యా?.. నిశ్చితార్థంపై జోరుగా ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya Engagement: భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన వ్యక్తిగత జీవితంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన తన గర్ల్‌ఫ్రెండ్, మోడల్-నటి మహికా శర్మతో నిశ్చితార్థం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల వైరల్ అయిన కొన్ని ఫోటోలు, హార్దిక్‌కు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. వీరిద్దరూ ఇంట్లో జరిగిన ఒక పూజలో పాల్గొన్న ఫోటోలు బయటకు రాగా, వాటిలో మహికా వేలికి పెద్ద ఉంగరం కనిపించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దీంతో వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగిందంటూ అభిమానులు సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై హార్దిక్ గానీ, మహికా గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
హార్దిక్ పాండ్యా, మహికా శర్మకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంట్లో నిర్వహించిన పూజా కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆ ఫోటోలలో మహికా చేతికి కనిపించిన పెద్ద ఉంగరాన్ని చూసి, ఇది నిశ్చితార్థపు ఉంగరమేనేమోనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కేవలం ఫోటోలో ఉంగరం కనిపించినంత మాత్రాన ఎంగేజ్మెంట్ ఖరారు కానప్పటికీ, ఇప్పటికే వీరి బంధంపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ ఫోటోలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Also Read
- Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!
- Vaibhav Sooryavanshi Batting: వైభవ్ సూర్యవంశీ విద్వంసకర ఇన్నింగ్స్ చూడలేదా?.. ఈ వీడియో మీకోసమే!
- Vaibhav Sooryavanshi: పదాలు సరిపోవడం లేదు.. తరానికొక్కడు.. ప్రత్యేకమైన ప్లేయర్.. వైభవ్‌పై ప్రశంసల వర్షం!
- ధోనీ కోసం ప్రత్యేక గది.. చెన్నై ITC హోటల్లో MS Dhoni Tribute Room ప్రారంభం.. ప్రత్యేకతలివే!
నిశ్చితార్థపు వార్తలకు హార్దిక్ పాండ్యాకు చెందినదని భావిస్తున్న ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ మరింత ఆజ్యం పోసింది. అందులో ఆయన “ఆఖరికి తను నాదైపోయింది” (Finally she became mine) అంటూ రాసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. తమ బంధంలో మరో అడుగు ముందుకు వేశారనే సంకేతంగానే హార్దిక్ ఈ పోస్ట్ పెట్టారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ పోస్ట్‌పైనా లేదా ఎంగేజ్మెంట్ వార్తలపైనా ఇరువురిలో ఎవరూ స్పందించకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది.
హార్దిక్ పాండ్యా, మహికా శర్మ 2025 అక్టోబర్‌లో తమ రిలేషన్‌షిప్‌ను బహిరంగపరిచారు. అప్పటి నుంచి పలు సందర్భాల్లో వీరిద్దరూ కలిసి కనిపిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మహికా శర్మ వృత్తిరీత్యా మోడల్, నటి, యోగా ట్రైనర్. పలు ఫ్యాషన్ షోలు, సినిమాలు, బ్రాండ్ ప్రమోషన్లలో ఆమె సందడి చేశారు. మోడలింగ్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహికా వేలిపై ఉంగరం, హార్దిక్ పోస్ట్‌తో వీరి బంధంపై మరోసారి చర్చ ఊపందుకుంది.
మహికా కంటే ముందు హార్దిక్ పాండ్యా సెర్బియన్ మోడల్, నటి నటాషా స్టాంకోవిచ్‌ను వివాహం చేసుకున్నారు. 2020లో వీరి వివాహం జరగగా, వీరికి అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు. అయితే, 2024 జూలైలో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు హార్దిక్, నటాషా ప్రకటించారు. విడిపోయినప్పటికీ, తమ కుమారుడి బాధ్యతలను ఇద్దరూ కలిసి చూసుకుంటున్నారు. మరోవైపు, హార్దిక్ కుమారుడు అగస్త్యతో మహికా కూడా సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Hardik Pandya: ‘చివరికి, ఆమె నాది’.. మహికా శర్మకు రింగ్ తొడిగిన హార్దిక్ పాండ్యా?.. నిశ్చితార్థంపై జోరుగా ప్రచారం
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ టైం మారేదెప్పుడు?
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
ట్రెండింగ్
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!
-
Vaibhav Sooryavanshi Batting: వైభవ్ సూర్యవంశీ విద్వంసకర ఇన్నింగ్స్ చూడలేదా?.. ఈ వీడియో మీకోసమే!
-
Jennifer Barreto: 116 అందగత్తెలతో పోటీ.. Miss Universe 2026 విజేతగా ‘జెన్నిఫర్ బారెటో’..!
-
ధోనీ కోసం ప్రత్యేక గది.. చెన్నై ITC హోటల్లో MS Dhoni Tribute Room ప్రారంభం.. ప్రత్యేకతలివే!