Terrible incident: హైదరాబాద్‌లోని చందానగర్ పరిధిలోని నల్గండ్‌లో శుక్రవారం ఓ దారుణం జరిగింది. నడిరోడ్డుపై భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త నరేందర్. బండరాయితో మోది ఆమె తను కాపాడుకునేందుకు పరుగులు పెట్టినా వదలలేదు ఆమెను వెంటాడి కత్తితో దారుణంగా పొడిచి చంపాడు.ఈ దారుణమైన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Read also: KTR: పార్లమెంట్ కి అంబేద్కర్ పేరుపెట్టాలి.. కేంద్రానికి కేటీఆర్ డిమాండ్
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్లలో నివాసముంటున్న తాండూరుకు చెందిన అంబిక, నరేందర్ లు భార్య భర్తలు. అంబిక శ్వాస బొటిక్ షాపులో పనిచేస్తుంది. అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంలో కలతలు మొదలయ్యాయి. రోజు ఒకరినొకరు గొడవకు దిగేవారు. అయితే గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య అంబిక భర్తకు దూరమైంది. ఆమె తన కుమార్తెతో కలిసి మరో ఇంట్లో నివసిస్తోంది. ఈ క్రమంలో నల్లగండ్ల బాట షోరూమ్ పైనున్న స్వషా బోటిక్ లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే భార్య అంబికపై విపరీతమైన కోపం పెంచుకున్న సురేందర్ ఆమెను ఎలాగైనా చంపేయాలనుకున్నాడు. ఆమెను చంపేందుకు ప్లాన్ వేశాడు. శుక్రవారం ఉదయం 11.40 సమయంలో షాప్ లో పనిచేస్తున్న సమయంలో అంబిక వద్దకు తన భర్త నరేందర్ వచ్చాడు. పక్కనే వున్న బండరాయితో అంబిక తలపై మొదాడు. అంబిక కిందకు పడిపోయింది. క్షణాల్లో తేరుకున్న అంబిక అతని వద్దనుంచి తప్పించుకునేందుకు నడిరోడ్డుపై పరుగులు పెట్టింది.
నరేందర్ అయినా అంబికను వెంటాడాడు. రోడ్డుపైనే ఆమెపై కత్తితో దాడి చేశాడు. నడిరోడ్డుపై ఆమెపై దాడి జరుగుతున్న ఎవరు ఆపలేదు. భయంతో స్థానికులు పరుగులు పెట్టారు. అయితే అంబిక పరుగులు పెడుతూ వున్న ఆరాక్షసుడి నుంచి కాపాడుకోలేకపోయింది. తీవ్ర రక్తశ్రావం కావడంతో ఆమె కిందకు పడిపోయింది. దీంతో నరేందర్ తనవద్ద కత్తితో ఆమెను విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశాడు. స్థానికులు సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితున్ని అదుపులో తీసుకున్నారు. అయితే.. ఏడాది కాలంగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తు లో తేలిందని సీఐ క్యాస్త్రో తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Heatwave Alert: మూడు రోజులు భానుడి భగభగలు…ఆ రాష్ట్రాల్లో 43 డిగ్రీలు