Sreejith Ravi : బాలికలతో అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసులో ప్రముఖ విలన్‌కు షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెండితెరపై కరడుగట్టిన విలన్‌గా, క్రూరమైన పోలీస్ అధికారిగా మెప్పించిన మలయాళ నటుడు శ్రీజిత్ రవికి కోర్టు గట్టి షాకిచ్చింది. చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం, త్రిసూర్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఏడాది పాటు కఠిన కారాగార శిక్షను విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. మలయాళ పరిశ్రమలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీజిత్ రవి, తమిళ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ముఖ్యంగా ‘కుంకీ’ చిత్రంలో ఫారెస్ట్ రేంజర్‌గా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో ఆయన నటనకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ‘వేట్టై’, ‘కథాకళి’ వంటి చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించారు. అయితే, తెరపై విలనిజం పండించే ఈ నటుడు నిజ జీవితంలో చేసిన ఓ నీచమైన పని ఇప్పుడు ఆయన్ను కటకటాల పాలు చేసింది.
అసలు విషయం ఏంటంటే.. 2022లో కేరళలోని త్రిసూర్‌లో ఇద్దరు మైనర్ బాలికలు తమ అపార్ట్‌మెంట్‌కు తిరిగి వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి కారులో వారిని వెంబడించాడు. అంతటితో ఆగకుండా, ఆ చిన్నారుల ఎదుట అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై బాధిత బాలికల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, దర్యాప్తులో ఆ వ్యక్తి ప్రముఖ నటుడు శ్రీజిత్ రవి అని తేలడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో పోలీసులు ఆయనపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ సమయంలో ఆయన బెయిల్‌పై బయటకు వచ్చినప్పటికీ, న్యాయస్థానంలో విచారణ మాత్రం ఆగలేదు. నాలుగేళ్ల పాటు సాగిన ఈ న్యాయపోరాటంలో నేరం రుజువు కావడంతో తాజాగా కోర్టు తుది తీర్పును ప్రకటించింది. శ్రీజిత్ రవికి ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 50,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ జరిమానా మొత్తాన్ని బాధిత బాలికలిద్దరికీ సమానంగా నష్టపరిహారం కింద అందజేయాలని కోర్టు స్పష్టం చేసింది. సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న నటుడికి ఇలాంటి కేసులో శిక్ష పడటం ఇప్పుడు దక్షిణాది చిత్రసీమలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read
తాజావార్తలు
-
Sreejith Ravi : బాలికలతో అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసులో ప్రముఖ విలన్‌కు షాక్
-
David Warner: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి వార్నర్ మళ్లీ వస్తాడా?.. ఆరెంజ్ ఆర్మీ ప్లాన్ ఏంటి..?
-
Vaibhav Sooryvanshi: నేను ముందే చెప్పా.. 200 కాదు 300 నా టార్గెట్..
-
Telangana MLC: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల.. ఆమోదం పొందిన దరఖాస్తులు ఇవే..
-
Khelo India 2026: ఖేలో ఇండియా-2026 ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. బ్రోచర్ విడుదల
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!