ఐపీఎల్ 14 సీజన్ లో రికార్డులు ఇవే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 14 సీజన్ ఎన్నో రికార్డులకు వేదికైంది. మిస్టర్ కూల్ ధోనీ కెప్టెన్సీకి తోడు యువక్రీడాకారుల అద్భుత ప్రతిభ తోడు కావడంతో… నాలుగోసారి చెన్నై కప్ అందుకుంది. ఈ ఐపీఎల్పోరులో యువతరంగాలు రుతురాజ్, హర్షల్ పటేల్,వెంకటేష్ అయ్యర్… మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు. ఈ సారి ఐపీఎల్ పండుగ ఆద్యంతం అభిమానులను అలరించింది.
ఐపీఎల్ 14వ సీజన్ ఆర్భాటంగా ముగిసింది. ఎంతో మంది కొత్త క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. ఎన్నో రికార్డులు బద్దలు కాగా…మరెన్నో కొత్త రికార్డులు నమోదయ్యాయ్. చెన్నై సూపర్ కింగ్స్…నాల్లోసారి టైటిల్‌ను ముద్దాడింది.
Also Read
- IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
- PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
కోలకత్తా, ఆర్సీబీ, ఢిల్లీ కేపిటల్స్…ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబరిచాయ్. ఆయా జట్లలోని పలువురు ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. దీంతో టోర్నీ నిర్వాహకులు వారందరినీ ప్రత్యేక అవార్డులతో సత్కరించారు. వీరందరిలో అత్యంత విలువైన అటగాడు కూడా హర్షల్ పటేలే.
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్… ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్‌ద సీజన్‌గా నిలిచాడు.ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలతో …మొత్తం 635 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.
బెంగళూరు ఆటగాడు హర్షల్ పటేల్…32 వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. ఓ మ్యాచ్‌లో ఐదు, మరోమ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో బ్రావోతో సమానంగా నిలిచాడు. గేమ్ చేంజర్ ఆఫ్ ది సీజన్ అవార్డు దక్కించుకున్నాడు హర్షల్ పటేల్.
కోల్కత్తా నైట్ రైడర్స్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్…10 మ్యాచ్‌ల్లో 370 పరుగులు చేశాడు. పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు అందుకున్నాడు. ఈ సీజన్లో ఏకంగా 30 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ రికార్డు సాధించాడు. ఢిల్లీ ప్లేయర్ సిమ్రన్ హెట్మైయర్…సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచాడు.
కోల్‌కతా బ్యాట్స్‌మన్ సునీల్ నరైన్ ఆడిన షాట్‌ను గాల్లో డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు కింగ్స్ ఎలెవన్ ఆటగాడు రవి బిష్ణోయ్. ఫెయిర్ ప్లే అవార్డు రాజస్థాన్ రాయల్స్ జట్టు దక్కించుకుంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!