India A vs Sri Lanka A: మొదట తిలక్ వర్మ.. తర్వాత వైభవ్ సూర్యవంశీ.. గందరగోళంగా భారత్-శ్రీలంక మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India A vs Sri Lanka A: దంబుల్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగిన ఇండియా ‘ఎ’–శ్రీలంక ‘ఎ’ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగినా, చివరకు వివాదాలతో ముగిసింది. సూపర్ ఓవర్ వరకు వెళ్లిన ఈ పోరులో శ్రీలంక ‘ఎ’ విజయం సాధించగా, మ్యాచ్ అనంతరం భారత యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ఆటగాళ్లతో ఘర్షణకు దిగడం పెద్ద చర్చకు దారితీసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ‘ఎ’ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది. సూర్యాంశ్ షెడ్గే 72 పరుగులు, విప్రజ్ నిగమ్ 51 పరుగులతో జట్టుకు బలమైన స్కోరు అందించారు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ మాత్రం 14 బంతుల్లో 21 పరుగులు చేసి అవుటయ్యాడు.
ఇక, 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ‘ఎ’ కూడా 50 ఓవర్లలో 265 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ నిర్వహించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ‘ఎ’ 16 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనకు దిగిన ఇండియా ‘ఎ’ 10 పరుగులకే పరిమితమైంది. సూపర్ ఓవర్ చివరి బంతి అనంతరం శ్రీలంక ఆటగాళ్లు విజయోత్సాహంలో సంబరాలు చేసుకుంటుండగా, వైభవ్ సూర్యవంశీ అసహనానికి గురైనట్లు కనిపించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగిన అతడు, ఒక ఆటగాడిని తోసినట్లు వీడియోల్లో కనిపించింది. దీంతో కొద్దిసేపు మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీలంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా సహా పలువురు ఆటగాళ్లు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Women's Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నప్పటికీ, వైభవ్ కోపం వెంటనే తగ్గలేదు. సహచర ఆటగాళ్లు అతడిని శాంతింపజేసి మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే మ్యాచ్‌లో వివాదం కేవలం చివర్లోనే కాదు. సూపర్ ఓవర్‌కు ముందు ఇండియా ‘ఎ’ కెప్టెన్ తిలక్ వర్మ కూడా అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. వెలుతురు పరిస్థితులు, ఆట కొనసాగింపు అంశాలపై మొదట చర్చించిన తిలక్, అనంతరం సూపర్ ఓవర్ సమయంలో నో-బాల్ నిర్ణయంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
అయితే, వైభవ్ సూర్యవంశీకి మైదానంలో ఇలాంటి సంఘటనలు కొత్తకాదు. గతంలో అండర్-19 ఆసియా కప్ ఫైనల్ సందర్భంగా పాకిస్థాన్ యువ బౌలర్ అలీ రజాతో కూడా అతడు వాగ్వాదానికి దిగాడు. అతడి దూకుడు స్వభావం అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ, భవిష్యత్తులో ఆట స్ఫూర్తిని కాపాడుకుంటూ భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌కు బదులుగా, చివర్లో చోటుచేసుకున్న ఈ ఘర్షణలే ఇప్పుడు ఎక్కువగా చర్చకు దారితీస్తున్నాయి.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!