Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- కర్ణాటకలో అర్ధరాత్రి విషాదం
- ఫ్రిజ్ పేలడంతో నలుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Belagavi Refrigerator Blast: కర్ణాటకలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లోని ఫ్రిజ్ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బెళగావి నగరంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మృతులను భారతి దామోనే (50), శారద దామోనే (45), గంగ దామోనే (25), ప్రియ దామోనే (24)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గజానన్ దామోనే (65), రోషన్ దామోనే (21) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గజానన్‌కు సుమారు 60 శాతం కాలిన గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
గణేశ్ చతుర్థి ఏర్పాట్ల మధ్య ప్రమాదం
పోలీసుల వివరాల ప్రకారం.. దామోనే కుటుంబం గణేశ్ చతుర్థి వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సెంట్రల్ బస్‌స్టాండ్ సమీపంలోని చావట్ గల్లీలో ఉన్న తమ ఇంట్లో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సోమవారం రాత్రి భోజనం చేసిన అనంతరం కుటుంబ సభ్యులు నిద్రకు ఉపక్రమించారు. ప్రతిరోజూ మాదిరిగానే ఫ్రిజ్‌కు సమీపంలో ఉన్న షెడ్లో నిద్రించారు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
అర్ధరాత్రి సుమారు 2.15 గంటల సమయంలో భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే కుటుంబం నివసిస్తున్న షెడ్ వద్దకు చేరుకోగా.. మంటల్లో చిక్కుకున్నట్లు గుర్తించారు. స్థానికులు మంటల్లో నుంచి గజానన్, రోషన్‌లను బయటకు తీసుకువచ్చారు. అయితే మిగిలిన నలుగురు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు.
షెడ్ ధ్వంసం.. విలువైన వస్తువులు కాలిబూడిద
ఫ్రిజ్ పేలుడు ధాటికి కాంక్రీట్ గోడలు లేని షెడ్ పూర్తిగా ధ్వంసమైంది. ఇంట్లోని విలువైన వస్తువుల్లో ఎక్కువ భాగం మంటల్లో కాలిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో ఫ్రిజ్ పేలినట్లు స్పష్టమవుతున్నప్పటికీ.. అది ఎందుకు పేలిందనే విషయాన్ని నిర్ధారించేందుకు విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే పేలుడు సంభవించిందా? లేక మరేదైనా కారణంతో మంటలు చెలరేగాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
గణేశుడి అలంకరణ లైట్లపైనా అనుమానం
కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహానికి కొన్ని అలంకరణ లైట్లు అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ లైట్ల కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడవుతాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల్లో శారద.. గజానన్ భార్య కాగా, భారతి ఆయన సోదరి. గంగ, ప్రియలు గజానన్- శారద దంపతుల కుమార్తెలు. రోషన్ వారి కుమారుడు. గజానన్ వృత్తిరీత్యా కార్పెంటర్‌గా పనిచేస్తుండగా.. కుటుంబంలోని మిగతా సభ్యులు ఇళ్లలో పనులు లేదా వాణిజ్య సంస్థల్లో ఉద్యోగాలు చేసేవారని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!