Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Agarkar Future: బీసీసీఐ మరియు టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందా? అంటే అవుననే సమాచారం.. దీంతో, అజిత్ అగార్కర్ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. బీసీసీఐతో అగార్కర్ భవిష్యత్‌పై వచ్చే రెండు రోజుల్లో కీలక చర్చలు జరగనున్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఆయన పదవీకాలం పొడిగింపుపై బోర్డు అధికారులు, సెలెక్షన్ కమిటీ మధ్య చర్చలు జరగనున్నాయి. అగార్కర్‌కు కొనసాగింపు ఇవ్వాలనే దిశగా ఇరు వర్గాలు సానుకూలంగా ఉన్నప్పటికీ.. గత రెండు నెలలుగా బీసీసీఐ అధికారులకు, సెలెక్షన్ కమిటీకి మధ్య విభేదాలు తలెత్తినట్టు నివేదికలు చెబుతున్నాయి..
48 గంటల్లో అగార్కర్ భవితవ్యంపై నిర్ణయం?
2023 జూలై 4న బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలోని సెలెక్షన్ కమిటీ కాలంలో భారత జట్టు 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2026 టీ20 ప్రపంచకప్‌ను కూడా గెలుచుకుంది. అయితే, ప్రస్తుతం ఆయన కాంట్రాక్ట్ పొడిగింపు అంశం కీలకంగా మారింది. తాజా నివేదికల ప్రకారం.. అగార్కర్, బీసీసీఐ ఆఫీస్ బేరర్లు వచ్చే రెండు రోజుల్లో సమావేశమై ఆయన పదవీకాలాన్ని పొడిగించడంపై రోడ్‌మ్యాప్ రూపొందించనున్నారు. కొన్ని చిన్నపాటి సమస్యలను పరిష్కరించుకుని అగార్కర్‌కు కొనసాగింపు ఇవ్వాలని ఇరు వర్గాలు సానుకూలంగా చూస్తున్నట్లు సమాచారం.
Also Read
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
- 2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
బీసీసీఐ, సెలెక్షన్ కమిటీ మధ్య ‘కోల్డ్ వార్’?
గత రెండు నెలలుగా బీసీసీఐ అధికారులకు, సెలెక్షన్ కమిటీకి మధ్య సంబంధాలు సజావుగా లేవని నివేదికలు పేర్కొంటున్నాయి. దీనికి తోడు సెప్టెంబర్ 3న జరిగిన బీసీసీఐ కీలక సమీక్షా సమావేశానికి అజిత్ అగార్కర్ హాజరుకాకపోవడం మరింత చర్చకు దారితీసింది. అయితే, అగార్కర్ సమావేశానికి ఎందుకు హాజరుకాలేదనే దానిపై బీసీసీఐ కార్యదర్శి దేబాజిత్ సైకియా వివరణ ఇచ్చారు. సమావేశం స్వల్ప నోటీసుతో ఏర్పాటు కావడంతో అగార్కర్ అప్పటికి నగరంలో లేరని, ఆయన ఉన్న ప్రాంతంలో సరైన ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడంతో ఆన్లైన్లో కూడా పాల్గొనలేకపోయారని తెలిపారు. ఆ సమావేశంలో సెలెక్షన్ కమిటీ మార్పులు లేదా అగార్కర్ భవిష్యత్తుపై ఎలాంటి చర్చ జరగలేదని బీసీసీఐ స్పష్టం చేసింది.
అగార్కర్ హయాంలో కీలక విజయాలు
చీఫ్ సెలెక్టర్‌గా అగార్కర్ పదవీకాలం భారత క్రికెట్లో కీలక మార్పులకు వేదికగా నిలిచింది. ఆయన నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సమయంలో భారత్ 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్ టైటిళ్లను సాధించింది. ఇదే సమయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలకడం, రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం వంటి కీలక పరిణామాలు కూడా జరిగాయి.
అక్టోబర్ 4తో కాంట్రాక్ట్ ముగింపు
అగార్కర్ ప్రస్తుత కాంట్రాక్ట్ అక్టోబర్ 4తో ముగియనుంది. ఆయనకు మరో ఏడాది పొడిగింపు పొందే అవకాశం ఉంది. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని సెలెక్షన్ ప్రక్రియలో కొనసాగింపును తీసుకురావాలని బీసీసీఐ భావిస్తోందనే వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే ఇప్పటివరకు అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐ అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. వచ్చే రెండు రోజుల్లో జరిగే చర్చల తర్వాతే దీనిపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
వెస్టిండీస్ సిరీస్ జట్టు ఎంపిక కూడా కీలకమే
వెస్టిండీస్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును త్వరలో ఎంపిక చేయనున్నారు. సెప్టెంబర్ 27న తిరువనంతపురంలో తొలి వన్డే జరగనుండగా, సెప్టెంబర్ 30న గౌహతిలో రెండో వన్డే, అక్టోబర్ 3న ముల్లన్‌పూర్‌లో మూడో వన్డే జరగనుంది. ఈ సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ భారత జట్టుకు నాయకత్వం వహించనున్నట్లు సమాచారం. కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. వెస్టిండీస్ వన్డే సిరీస్‌తో పాటు ఇరానీ కప్ జట్టును కూడా సెప్టెంబర్ 16న ఎంపిక చేయనున్నారు. ఆఫ్ఘన్‌తో రెండో టీ20 మరుసటి రోజే ఈ ఎంపిక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అజిత్ అగార్కర్ హాజరుకానున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?