Vaibhav Sooryavanshi: వైభవ్ ఎంట్రీపై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.. భావోద్వేగం గెలిచింది.. కానీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై చర్చ కొనసాగుతున్న వేళ మాజీ వికెట్‌కీపర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడం భావోద్వేగపరంగా సరైన నిర్ణయమే అయినప్పటికీ, ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే సంజూ శాంసన్‌ను పక్కన పెట్టడాన్ని సమర్థించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో సంజూకు నిలకడలేమి అనే విమర్శలు ఎదురైనా, ఇటీవలి కాలంలో అతను తన ఆటతీరుతో ఆ విమర్శలను అధిగమించాడని పార్థివ్ పేర్కొన్నారు. ఒకే ఆటగాడిని వేర్వేరు ప్రమాణాలతో అంచనా వేయకూడదని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తు దృష్ట్యా యువ ప్రతిభకు అవకాశాలు ఇవ్వడం అవసరమే అయినా, ప్రస్తుత ప్రదర్శనను విస్మరించరాదని సూచించారు.
అదే సమయంలో, భారత క్రికెట్లో జట్టులో లేని ఆటగాడే అత్యుత్తమ ఎంపికగా కనిపిస్తాడనే అభిమానుల మనస్తత్వాన్ని కూడా పార్థివ్ ప్రస్తావించారు. యువతకు అవకాశాలు కల్పించడం, అనుభవజ్ఞులకు న్యాయం చేయడం మధ్య సమతుల్యతను పాటించడమే సెలెక్టర్ల ముందున్న అసలు సవాలని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. జియోస్టార్‌తో మాట్లాడుతూ పార్థివ్ పటేల్, గత 11-12 ఏళ్లుగా సంజు శాంసన్ కెరీర్‌ను ఒకే ప్రశ్న వెంటాడుతోందని అన్నారు.. అదే అతని నిలకడ. ఈ కారణంగా అతన్ని జట్టు నుండి చాలాసార్లు తొలగించారు, కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని అభిప్రాయపడ్డారు.
Also Read
- India vs Afghanistan: భారత్‌తో పోరుకు ఆఫ్ఘనిస్తాన్ సై.. జట్టులోకి ప్రమాదకర పేసర్ రీఎంట్రీ
- IND vs SL 2nd Test: కొలంబో టెస్ట్‌లో భారత్ డిక్లేర్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్..
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- India vs Sri Lanka 2nd Test: కొలంబో టెస్ట్‌కు వర్షం ముప్పు.. 5 రోజులూ వర్షం.. మ్యాచ్ ఫలితం ఏమవుతుంది..?
సంజు శాంసన్‌ను ఎందుకు ఎప్పుడూ పక్కన పెడుతున్నారు? గతంలో అతను నిలకడగా పరుగులు చేయడం లేదని లేదా వేగంగా బ్యాటింగ్ చేయడం లేదని అనేవారు. కానీ ఒకే ఆటగాడిని వేర్వేరు కొలమానాల ఆధారంగా అంచనా వేయలేం అన్నారు పార్థి్వ్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడం భావోద్వేగపరంగా సరైన నిర్ణయమేనని, ఎందుకంటే అతను భారత క్రికెట్లో చాలా ప్రతిభావంతుడైన యువ తార అని పార్థివ్ ఇంకా పేర్కొన్నాడు. అయితే, ఎంపిక కేవలం ప్రదర్శన మరియు తర్కం ఆధారంగానే జరిగితే, సంజు శాంసన్ ను పక్కన పెట్టడానికి బలమైన కారణం ఏదీ ఉండదు అన్నారు..
కాగా, టీ20 ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంజు శాంసన్ వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో పెద్ద స్కోరు చేయడంలో విఫలమవడంతో, 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీని భారత టీ20 జట్టులోకి తీసుకున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు ఈ యువ బ్యాట్స్‌మన్‌పై విశ్వాసం వ్యక్తం చేసినప్పటికీ, వైభవ్ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపడంలో విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 0-3తో వెనుకబడి ఉంది. ఈ సిరీస్‌లోని ఐదవ, చివరి మ్యాచ్ ఈ రోజు జరగనున్న విషయం విదితమే..
తాజావార్తలు
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
Strait of Hormuz: హోర్ముజ్‌పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
-
KA Productions: కిరణ్ అబ్బవరం బ్యానర్లో మరో డిఫరెంట్ మూవీ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న మిస్టరీ పోస్టర్!
-
Irumudi Movie Controversy : ‘ఇరుముడి’ సినిమాపై వివాదం.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!