India Vs New Zealand: ఆకాశంలో విమానం.. లైవ్ స్కోర్ అప్డేట్స్ అందించిన ఇండిగో పైలెట్.. ట్వీట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Vs New Zealand: నిన్న జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ క్రికెట్ లవర్స్‌కి మంచి అనుభూతిని ఇచ్చింది. కెప్టెన్ రోహిత్ మెరుపు ఓపెనింగ్‌తో పాటు గిల్ సూపర్ ఇన్నింగ్స్ ఒకెత్తయితే, కింగ్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలోతో ఔరా అనిపించారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును బద్ధలు కొడుతూ.. వన్డేల్లో 50వ సెంచరీ చేసి విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. బుధవారం జరిగిన ఈ మ్యాచుని దేశం మొత్తం టీవీలు, మొబైళ్లకు అతుక్కుపోయారు.
ఇదిలా ఉంటే ఆకాశంలో ఉన్న విమానంలో ఏకంగా ఫ్లైట్ కెప్టెన్ క్రికెట్ లైవ్ స్కోర్ అందిస్తూ ప్రయాణికులను ఉత్సాహపరిచారు. ఈ ఘటన ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది. తమ పైలెట్ ప్రతీ 30 నిమిషాలకు ఒకసారి లైవ్ స్కోర్ అప్డేట్ చేయడంపై ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తపరిచారు. బెంగళూర్‌కి చెందిన కమ్యూనికేషన్ ప్రొఫెషనల్ నీర్జా షా ఈ విషయాన్ని ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొన్నారు. ‘‘ మా ఇండిగో6ఈ ఫ్లైట్ కెప్టెన్ ల్యాండ్ అయ్యే వరకు ప్రతీ అరగంటకు ఒకసారి వరల్డ్ కప్ మ్యాచ్ అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు. ఈ దేశం క్రికెట్‌ని ఎలా ఆరాధిస్తుందో తెలిసింది’’ అంటూ పోస్ట్ చేశారు.
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
- Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
- Mohammed Shami: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ షమీ.. 900 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..
Read Also: Rohit Shama: శ్రేయాస్‌ని ఇమిటేట్ చేసిన రోహిత్.. వీడియో వైరల్
కెప్టెన్ ఇలా లైవ్ స్కోర్ అప్డేట్స్ అందించడంపై ప్రయాణికులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో 2019లో వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచు గురించి ఓ నెటిజన్ ముంబై-బెంగళూర్ ఇండిగో విమానంలో ఇలాంటి ఘటననే గుర్తుచేసుకున్నారు.
దీనిపై స్పందించిన ఇండిగో యాజమాన్యం..‘‘మా కెప్టెన్ మీ విమానాన్ని లైవ్ స్టోర్ట్స్ అప్డేట్గా మార్చారని వినడానికి మేము సంతోషిస్తున్నాము. ఇండిగోలో మా ప్రయాణికులు ఆకర్షణీయమైన, వినోదాత్మక అనుభవాన్ని అందించాడాన్ని మేం లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేసింది.
నిన్న జరిగిన మ్యాచులో న్యూజిలాండ్‌పై ఇండియా 70 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. అనేక రికార్డులకు ఈ మ్యాచ్ వేదికగా నిలిచింది. క్రికెట్ లెజెండ్ సచిన్‌తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్‌కి చెందిన పలువురు నటులు హాజరయ్యారు. ఈ మ్యాచ్ గెలుపుతో ఇండియా ఫైనల్స్‌కి చేరుకుంది.
We're delighted to hear that our captain turned your flight into a live sports update! At IndiGo, we aim to create an engaging and entertaining experience for our passengers. (1/2)
— IndiGo (@IndiGo6E) November 15, 2023
తాజావార్తలు
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!