Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International Sports India Won The Toss And Chose To Field 2

WTC Final: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న భారత్

Published Date :June 7, 2023 , 3:25 pm
By NTV WebDesk
WTC Final: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న భారత్
  • Follow Us :
  • google news
  • dailyhunt

India Won The Toss And Chose To Field: లండన్‌లోని ఓవల్‌ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే! ఈరోజు నుంచి ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఈ మ్యాచ్‌లో.. టీమిండియా టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. హోరాహోరీగా సాగనున్న ఈ పోరులో, ఎవరు గెలుస్తారన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇంతకుముందు కూడా టీమిండియా ఫైనల్స్‌కు వెళ్లింది కానీ, న్యూజీలాండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. ఆ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు విఫలమవ్వడంతో, కివీస్ జట్టు భారత్‌పై సునాయాసంగా విజయం సాధించింది.

Monsoon: జూన్ 9న కేరళలోకి రుతుపవనాలు.. బిపోర్జాయ్ తుఫాన్ ప్రభావం..

ఈసారి మాత్రం భారత్ అలా చేజార్చుకోకూడదన్న పట్టుదలతో రంగంలోకి దిగింది. మొదటిసారి జరిగిన తప్పు మళ్లీ రిపీట్ అవ్వకుండా, ఆస్ట్రేలియాపై నెగ్గి ట్రోఫీ సొంతం చేసుకోవాలని కసి మీద ఉంది. అటు.. ఆస్ట్రేలియా సైతం ట్రోఫీ తప్పకుండా కొట్టాలన్న పంతంతో బరిలోకి దిగింది. క్రితంసారి ఫైనల్‌కి రాకుండానే తట్టాబుట్టా సర్దేసిన కంగారులు, ఈసారి ఎంతో కష్టపడి ఫైనల్ దాకా చేరుకున్నారు. ఇక్కడిదాకా వచ్చినప్పుడు, ఎలాగైనా కప్పు కొట్టాలన్న సంకల్పంతో వాళ్లు ఉన్నారు. అయితే.. ఓవల్‌లో ఆస్ట్రేలియాతో పోలిస్తే, భారత్‌కి మంచి రికార్డ్ ఉంది. ఒకరకంగా ఇది భారత్‌కి కలిసొచ్చే అంశమే! మరి, ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారన్నది వేచి చూడాలి.

Health Tips: బీట్ రూట్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.. ముఖ్యంగా దానికి..!

కాగా.. జట్టులో టీమిండియా నలుగురు పేసర్లకు చోటు కలిపించింది. అశ్విన్‌ స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ తుది జట్టులోకి రాగా.. వికెట్ కీపర్ భరత్, రహానే తుదిజట్టులో చోటు దక్కించుకున్నారు. అటు ఆసీస్‌ కూడా నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతుంది. గ్రీన్‌, కమిన్స్‌, స్టార్క్‌, బోలండ్‌ తుది జట్టులో ఉండగా.. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా నాథన్‌ లియోన్‌ను ఆసీస్‌ బరిలోకి దించింది.
టీమిండియా: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, చతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానే, కేఎస్‌ భరత్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌
ఆస్ట్రేలియా: ఉస్మాన్‌ ఖ్వాజా, డేవిడ్‌ వార్నర్‌, మార్నస్‌ లబూషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, ట్రవిస్‌ హెడ్‌, కెమరూన్‌ గ్రీన్‌, అలెక్స్‌ క్యారీ (వికెట్‌కీపర్‌), పాట్‌ కమిన్స్‌, నాథన్‌ లియోన్‌, స్కాట్‌ బోలండ్‌, మిచెల్‌ స్టార్క్‌

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India vs Australia
  • rohit sharma
  • VIRAT KOHLI
  • World Test Championship
  • WTC final

తాజావార్తలు

  • Astrology: ఏప్రిల్‌ 6, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్

  • Bhuvneshwar Kumar: ఐపీఎల్ చరిత్రలో తొలి ఫాస్ట్ బౌలర్‌గా.. భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions