IND Vs SL: తొలి టీ20 టీమిండియాదే.. వరుసగా పదో విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వదేశంలో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. ఇటీవల వెస్టిండీస్‌పై వరుసగా వన్డేలు, టీ20ల సిరీస్‌లను వైట్ వాష్ చేసిన భారత్.. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను కూడా విజయంతోనే ప్రారంభించింది. తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 199 పరుగుల భారీ స్కోరు చేసింది. 200 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. చివరకు 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియా 62 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. 89 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
కాగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఘన విజయం సాధించిన భారత్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా వరుసగా పది టీ20 మ్యాచ్‌ల్లో గెలిచింది. టీ20 మ్యాచ్‌ల విషయంలో ఇలా వరుసగా 10 మ్యాచ్‌లు గెలవడం టీమిండియాకు ఇదే తొలిసారి. అలాగే భారత్ తరఫున ఒక మ్యాచ్‌లో అత్యధిక పరుగులు(89) చేసిన వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు భారత్‌కు చెందిన ఏ వికెట్ కీపర్ ఇన్ని పరుగులు చేయలేదు.
Also Read
- India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- India Test Record: లంక గడ్డపై టీమ్ ఇండియా చరిత్ర.. 2010 నుంచి చెక్కుచెదరని రికార్డు
- India and Sri Lanka: 429/9 వద్ద మ్యాచ్‌కు తెర.. కొలంబోలో భారత్, శ్రీలంక డ్రా.. సిరీస్ మనదే..
- ICC: స్టార్ క్రికెటర్‌కు భారీ షాక్.. డోపింగ్ కేసులో 15 నెలల బ్యాన్
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!