IND vs NZ ODI: ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. భారత్ తుది జట్టులో ఊహించని మార్పులు.. కొత్త కుర్రాడి ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NZ ODI: భారత్, న్యూజిలాండ్ (India vs New Zealand) మధ్య ఇవాళ (నవంబర్ 15) ఆఖరి వన్డే, డిసైడింగ్ మ్యాచ్ జరగనుంది. మౌంట్ మాంగనుయ్‌లోని (Mount Maunganui) బే ఓవల్ (Bay Oval) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత కాలమానం (IST) ప్రకారం ఉదయం 7:30 గంటలకు తొలి బంతి పడనుంది. ఈ సిరీస్‌లో ఇరు జట్లు ఇప్పటికే హోరాహోరీగా తలపడ్డాయి. ఆక్లాండ్, వెల్లింగ్టన్లలో జరిగిన తొలి రెండు వన్డేల్లో టీమిండియా (Team India) విజయాలు సాధించి ఆధిక్యంలో నిలిచినా, హామిల్టన్‌లో జరగాల్సిన మూడో మ్యాచ్ వర్షం (Rain) కారణంగా రద్దయింది. ఇక బే ఓవల్ వేదికగానే జరిగిన నాలుగో వన్డేలో కవీస్ జట్టు (New Zealand Team) ఏకంగా 244 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ప్రసుత్తం టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. దీంతో నేటి ఆఖరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని శ్రేయాస్ అయ్యర్ సేన పట్టుదలగా ఉంది.
ఇక, టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో (Playing XI) ఊహించని మార్పులు జరిగాయి. నిర్ణయాత్మక ఆఖరి వన్డే మ్యాచ్‌లో యశ్ ఠాకూర్ (Yash Thakur) తన తొలి వన్డే క్యాప్ అందుకుని అరంగేట్రం చేశాడు. కివీస్‌తో జరుగుతున్న ఈ సిరీస్ డిసైడర్‌లో భారత్ తన బౌలింగ్ లైనప్‌ను బలోపేతం చేసే పనిలో పడింది. గత మ్యాచ్‌లో ఆడిన గుర్నూర్ బ్రార్ (Gurnoor Brar) టెస్ట్ స్క్వాడ్‌కు ఎంపిక కావడంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. మరోవైపు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) గత మ్యాచ్‌లోనే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినా, ఆ ప్రదర్శన ఆశించిన స్థాయిలో రాకపోవడంతో మరోసారి తుది జట్టులో చోటు కోల్పోయాడు. అతడి స్థానంలో స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) తుది జట్టులోకి వచ్చాడు. చాలాకాలంగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న సిరాజ్, ఈ సిరీస్ ఫినాలేలో (Series finale) తన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి అద్భుతమైన అవకాశం లభించింది. మరి ఈ మార్పులు టీమిండియాకు ఏమేరకు కలిసి వస్తాయో చూడాలి!
Also Read
- Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
- Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
- Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
- India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్‌కు పాకిస్తాన్ మంత్రి!
జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (సి), ఇషాన్ కిషన్ (w), అక్షర్ పటేల్, నమన్ ధీర్, ఔకిబ్ నబీ, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, యశ్ ఠాకూర్
న్యూజిలాండ్ (ఆడే జట్టు): విల్ యంగ్, టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), నిక్ కెల్లీ, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), క్రిస్టియన్ క్లార్క్, బ్లెయిర్ టిక్నర్, జాకబ్ డఫీ, మాథ్యూ ఫిషర్
తాజావార్తలు
-
IND vs NZ ODI: ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. భారత్ తుది జట్టులో ఊహించని మార్పులు.. కొత్త కుర్రాడి ఎంట్రీ..
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఊహించని డబ్బు.. మీరేనేమో తెలుసుకోండి!
-
SpaceX: చరిత్ర సృష్టించిన స్పేస్ఎక్స్.. అంతరిక్షం నుంచి వచ్చిన స్టార్‌షిప్‌ను గాల్లోనే పట్టుకున్న లాంచ్ టవర్
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!