ఇక వన్డే సమరం.. సిరీస్‌పై టీమిండియా గురి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా… ఇవాళ్టి నుంచి వన్డే సిరీస్ వేట మొదలుపెట్టబోతోంది. మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి మొదలయ్యే వన్డేల్లో నెగ్గి.. సిరీస్‌ను గెలవాలన్న కసితో ఉంది. వన్డే జట్టు కెప్టెన్‌గా పగ్గాలందుకున్న కేఎల్ రాహుల్.. ఓపెనర్‌గా బరిలోకి దిగబోతున్నాడు. ఈ విషయాన్ని రాహులే స్వయంగా ప్రకటించాడు. వన్డేల్లో ఎప్పుడూ 4 లేదా ఐదో స్థానంలో బరిలోకి దిగే రాహుల్… గాయం కారణంగా రోహిత్ శర్మ సిరీస్‌కు దూరం కావడంతో… అతడి స్థానంలో ఓపెనర్ అవతారం ఎత్తనున్నాడు.
Read Also: జనవరి 19, బుధవారం దినఫలాలు…
Also Read
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
- IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
- CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
- IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్‌పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
వన్డే సిరీస్‌లో రాహుల్‌కు జతగా ధవన్ లేదా రుతురాజ్ గైక్వాడ్‌లో ఒకరు ఓపెనర్‌గా బరిలోకి దిగుతారు. ఇక మూడో స్థానంలో ఎప్పట్లాగే కోహ్లీ బ్యాటింగ్‌కు దిగబోతున్నాడు. కెప్టెన్సీని వదులుకున్న తర్వాత అయినా కోహ్లీ మళ్లీ తన పాత ఫామ్‌ను అందుకుంటాడేమో చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. పైగా వన్డేల్లో కోహ్లీ సెంచరీ కొట్టి చాలా రోజులైంది. ఈ సిరీస్‌లో అయినా కోహ్లీ ఓ వంద బాదేస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ లేదా శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఐదో స్థానంలో, వన్డేల్లోకి అరంగేట్రం చేయబోతున్న వెంకటేశ్ అయ్యర్ ఆరోస్థానంలో ఆడనున్నారు. బౌలర్ల విషయానికొస్తే… బుమ్రా, భువీలతో పాటు మూడో పేసర్‌గా దీపక్ చాహర్ లేదా శార్దూల్ ఠాకూర్ బంతిని అందుకునే అవకాశం ఉంది. స్పిన్ విభాగంలో అశ్విన్, చాహల్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. మరోవైపు, టెస్ట్ సిరీస్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న సఫారీ టీమ్… వన్డే సిరీస్‌నూ గెలవాలన్న పట్టుదలతో ఉంది. గత పర్యటనలో టీమిండియా చేతిలో వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్‌కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!