IND Vs NZ: నేడు మూడో వన్డే.. మరో క్లీన్ స్వీప్పై టీమిండియా కన్ను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Vs NZ: సొంతగడ్డపై వరుసగా ద్వైపాక్షిక సిరీస్లను గెలుస్తున్న టీమిండియా ఇప్పటికే న్యూజిలాండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈరోజు ఇండోర్ వేదికగా జరగనున్న మూడో వన్డేలో కూడా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను కూడా భారత్ క్వీన్ స్వీప్ చేసింది. అయితే ఈ వన్డేలో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించే అవకాశం ఉంది. తొలి వన్డేలో కష్టపడి గెలిచిన రోహిత్ సేన రెండో వన్డేలో మాత్రం పూర్తి ఆధిపత్యం చూపించింది. మరి మూడో వన్డేలో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో వేచి చూడాలి.
Read Also: Sajjanar Twitter Hacked : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
Also Read
- Vaibhav Sooryavanshi: సిరాజ్ దెబ్బకు కుప్పకూలిన బుడ్డోడు.. నొప్పిని భరిస్తూనే వరల్డ్ రికార్డు బద్దలు..
- IPL 2026 ప్లేఆఫ్స్ రేసు.. ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ పక్కా.. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ జట్టుకు టైటిల్ ఖాయమన్న అశ్విన్
- Vaibhav Sooryavanshi: "సిక్సర్ల సునామీ".. ఫస్ట్ బాల్కే ప్రపంచ రికార్డు బద్దలుగొట్టిన వైభవ్ సూర్యవంశీ!
- GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
ఈ మ్యాచ్ ఇండోర్లో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. బ్యాటింగ్ పరంగా భారత్కు పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. కాకపోతే మిడిలార్డర్లోని ఆటగాళ్లు పూర్తిస్థాయిలో సత్తా చూపించడం లేదు. ఓపెనర్లు లేదా వన్డౌన్లో విరాట్ కోహ్లీ చెలరేగితేనే భారత్ భారీ స్కోర్లు చేస్తోంది. టాపార్డర్ విఫలమైతే మిడిలార్డర్ ఏం చేస్తుందో ఇటీవల పెద్దగా కనిపించలేదు. శ్రీలంకపై రెండు సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ న్యూజిలాండ్తో జరిగిన రెండు వన్డేల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. మరి మూడో వన్డేలో ఏం చేస్తాడో చూడాలి. ఈ మ్యాచ్లో ఉమ్రాన్ మాలిక్, చాహల్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారి కోసం ఎవరు త్యాగం చేస్తారో అన్న విషయం ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Vijay-Trisha: విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే ఆ ఫంక్షన్లో నేనే డాన్స్ చేస్తా.. రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్!
-
Beetroot Buttermilk Recipe: నిమిషాల్లో బీట్రూట్ మజ్జిగ రెడీ.. ప్రతిరోజూ తాగితే ముఖం మెరిసిపోతుంది..!
-
Tamilanadu CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్.. దశాబ్దాల నాటి డీఎంకే-ఏఐఏడీఎంకే శకానికి తెర
-
Shubman Gill: ఏబీ డి విలియర్స్ను వెనక్కి నెట్టి.. కోహ్లీ, రోహిత్ సైతం సాధించలేని రికార్డ్ క్రియేట్ చేసిన శుభ్మన్ గిల్
-
Trisha: నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయిన త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో స్పెషల్ అట్రాక్షన్!