IND Vs NZ: సొంతగడ్డపై వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లను గెలుస్తున్న టీమిండియా ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈరోజు ఇండోర్ వేదికగా జరగనున్న మూడో వన్డేలో కూడా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కూడా భారత్ క్వీన్ స్వీప్ చేసింది. అయితే ఈ వన్డేలో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించే…